AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Cooking: షాప్ నుంచి తీసుకురాగానే చికెన్ ను కడుగుతున్నారా? అయితే ప్రమాదకర బ్యాక్టిరియాకు వెల్కమ్ చెప్పినట్లే..!

ప్రపంచ ఆహార భద్రతా నిపుణులు మాత్రం చికెన్ తీసుకురాగానే కడగకుండా డైరెక్ట్ గా వండేసుకోడమే బెటర్ అని సూచిస్తున్నారు. ఎందుకంటే చికెన్ కడిగితే వంటగది చుట్టూ ప్రమాదకరమైన బ్యాక్టిరియా పెరగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి చికెన్ కడుగకుండా వండేసుకోడమే మంచిది అని అంటున్నారు.

Chicken Cooking: షాప్ నుంచి తీసుకురాగానే చికెన్ ను కడుగుతున్నారా? అయితే ప్రమాదకర బ్యాక్టిరియాకు వెల్కమ్ చెప్పినట్లే..!
Chicken
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 09, 2023 | 6:43 PM

Share

మామూలుగా మనం బయట నుంచి చికెన్ పట్టుకొచ్చినప్పుడు దాన్ని గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడుక్కోని కావాల్సిన మసాలాలను దట్టించి హ్యాపీగా కూర వండుకుని తినేస్తాం. ఈ ప్రాసెస్ చికెన్ తెచ్చిన ప్రతిసారి చేస్తూనే ఉంటాం. అయితే ప్రపంచ ఆహార భద్రతా నిపుణులు మాత్రం చికెన్ తీసుకురాగానే కడగకుండా డైరెక్ట్ గా వండేసుకోడమే బెటర్ అని సూచిస్తున్నారు. ఎందుకంటే చికెన్ కడిగితే వంటగది చుట్టూ ప్రమాదకరమైన బ్యాక్టిరియా పెరగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి చికెన్ కడుగకుండా వండేసుకోడమే మంచిది అని అంటున్నారు. అయితే వండే సమయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరైన ఉష్టోగ్రతలో చికెన్ వండకపోతేనే ఇబ్బంది ఎదురవుతుంది తప్ప కడగకపోడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యానికి క్యాంపిలోబాక్టర్, సాల్మోనెల్లా అనే బ్యాక్టిరియాలు కారణమవుతాయి. ఇవి ముఖ్యంగా క్రాస్ కాలుష్యం వల్ల సంభవిస్తుంది. చికెన్ వల్ల వచ్చే సమస్యకు కేవలం క్యాంపిలోబాక్టర్ మాత్రమే ప్రధాన కారణంగా నిలుస్తుంది.

అవన్నీ అపోహలే..

  1. కోడి మాంసంలో ఉండే రక్తం, వాటి మలం, లేదా వాటి వెంట్రుకలను కచ్చితంగా శుభ్రపరిస్తేనే అవి పోతాయని చాలా మంది నమ్ముతారు. కానీ వాటిన పచ్చిమాంసంపై నుంచే నీరు లేకుండా క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
  2. మరికొంత మంది కోడి మాంసాన్ని నిమ్మరసం లేదా వెనిగర్ తో శుభ్రపరుస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదం చేకూరుస్తుందని నిపుణులు వాదన. చికెన్ ను వండకుండా ఇతర పదార్థాలు ముఖ్యంగా పులుపు ఉన్న పదార్థాలతో కడగడం వల్ల క్రాస్-కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. 
  3. ప్రస్తుత కాలంలో చాలా మంది సింక్ వద్ద ట్యాప్ ను ఆన్ చేసి చికెన్ ను శుభ్రపరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వాటర్ స్పీడ్ కు చికెన్ తెల్లగా మారినా.. వాటి బిందువుల మాత్రం సింక్ చుట్టు పక్కల పడి బ్యాక్టిరియా పెంచడంలో సాయం చేస్తాయి. 

ఇలా కడగడం ఉత్తమం

మనం ఎంత తప్పని చెప్పినా ఇంట్లో వారు మాత్రం చికెన్ ను కడగకుండా వండటానికి ఇష్టపడరు. కాబట్టి డైరెక్ట్ గా సింక్ వద్ద కాకుండా నీటిని ఓ పాత్రలోకి పట్టి అందులో చికెన్ ను వేసి నీరు చిందకుండా ఓ సారి లైట్ గా శుభ్రపరిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల క్రాస్-కాలుష్యం వల్ల కలిగే ఇబ్బందులను కొంచెమైనా నివారించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి