AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్, సీజనల్ ఫ్రూట్స్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో చికెన్, పండ్లను చేర్చాలని నిర్ణయించింది. ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం...

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్, సీజనల్ ఫ్రూట్స్.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
Chicken Curry
Ganesh Mudavath
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 06, 2023 | 3:02 PM

Share

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో చికెన్, పండ్లను చేర్చాలని నిర్ణయించింది. ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బియ్యం, బంగాళాదుంపలు, సోయాబీన్, గుడ్ల మధ్యాహ్న భోజన మెనూలో ఉన్నాయి. ఇకపై వాటితో పాటు వారానికి ఒకసారి చికెన్, సీజనల్ పండ్లను విద్యార్థులకు అందిస్తారు. అదనపు పౌష్టికాహార పథకం అమలులోకి వస్తోందని ధృవీకరించిన పాఠశాల విభాగం అధికారి.. ఏప్రిల్ తర్వాత దీనిని కొనసాగించాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీని ప్రకారం ఈ విధానం నాలుగు నెలల పాటు మాత్రమే కొనసాగనుందని తెలుస్తోంది. ప్రతి విద్యార్థికి అదనపు పోషకాహారాన్ని అందించడానికి వారానికి రూ. 20 ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 1.16 కోట్ల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందు కోసం రాష్ట్రం కేంద్రం 60:40 నిష్పత్తిలో ఖర్చును పంచుకుంటున్నాయి.

ఈ మేరకు రూ.371 కోట్లు అదనపు కేటాయింపును పూర్తిగా రాష్ట్రానికే కేటాయించారు. వారంలోని వివిధ రోజులలో ప్రతి బ్లాక్‌లో తక్షణమే అదనపు వస్తువులను అందజేస్తామని ఆయన చెప్పారు. ఈ చర్య రాజకీయ దుమారం రేపింది. బీజేపీ ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్నికల ముందు పాఠశాల విద్యార్థులకు చికెన్‌ వడ్డించాలనే నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం పేద పిల్లలకు ఈ వస్తువులు అందకుండా కేవలం బియ్యం, పప్పు మాత్రమే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ సాధారణ ప్రజల పక్షానే నిలబడతారని టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి విషయాన్ని బీజేపీ రాజకీయం చేయాలనుకుంటోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించామని, ఇబ్బందులు ఉన్నప్పటికీ, మధ్యాహ్న భోజన పథకాన్ని ఆపివేయలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.