AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మధుమేహం ఉన్నవారు స్ట్రాబెర్రీలను తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. అందుకే మధుమేహులు వారి ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్ల విషయంలో కూడా డయాబెటీస్‌ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అయితే, షుగర్‌ బాధితులు స్ట్రాబెర్నీ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా.?

Health Tips: మధుమేహం ఉన్నవారు స్ట్రాబెర్రీలను తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
Strawberry
Jyothi Gadda
|

Updated on: Mar 04, 2024 | 10:53 AM

Share

మధుమేహం.చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వెంటాడుతుంది. చాపకింద నీరులా సోకే వ్యాధిని డయాబెటీస్‌, షుగర్‌ వ్యాధి అనే పేర్లతో పిలుస్తారు. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. అందుకే మధుమేహులు వారి ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్ల విషయంలో కూడా డయాబెటీస్‌ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అయితే, షుగర్‌ బాధితులు స్ట్రాబెర్నీ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా.?

స్ట్రాబెర్రీ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన బెర్రీ పండు. స్ట్రాబెర్రీలు తీపి, టార్ట్ రుచిని కలిగి ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్ట్రాబెర్రీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు సహజ తీపితో ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలో ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే, ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహ నియంత్రణలో ఇది మరొక ముఖ్యమైన అంశం. స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీ శోథ నిరోధక ప్రభావాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయం. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రాబెర్రీలు “చెడు” LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు సమతుల్య ఆహారంలో భాగంగా స్ట్రాబెర్రీలను తినవచ్చు. అలాగే స్ట్రాబెర్రీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో