Srisailam: శ్రీశైల మల్లన్నకు దుర్గమ్మ వారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకీలాద్రి దేవస్థానం..

అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక వేదపండితులు పట్టు వస్ర్తాలను తలపై ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు సమర్పించుకున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.

Srisailam: శ్రీశైల మల్లన్నకు దుర్గమ్మ వారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకీలాద్రి దేవస్థానం..
Srisailam
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Mar 05, 2024 | 11:37 AM

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు విజయవాడ దేవస్థానం తరుపున దుర్గమ్మ ఆలయ ఈవో కె.ఎస్.రామారావు, చైర్మన్ రాంబాబు దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న దుర్గమ్మ దేవస్థానం అర్చకులకు ఈవో రామరావు,చైర్మన్ రాంబాబుకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.

ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి చైర్మన్‌ కె. రాంబాబు, ఈవో కెఎస్‌ రామారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక వేదపండితులు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్నారు. వారికి శ్రీశైల దేవస్థానం చైర్మన్‌ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక వేదపండితులు పట్టు వస్ర్తాలను తలపై ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు సమర్పించుకున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.

అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, దుర్గమ్మ ఆలయ ఈవో రామారావుకు చైర్మన్ రాంబాబుకు దేవస్థానం ఈవో,అర్చకులు,అధికారులకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించారు. లడ్డు ప్రసాదాలను శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు. అనంతరం తిరిగి శ్రీశైలం ఈవో పెద్దిరాజు దంపతులకు విజయవాడ ఈవో రామారావు,చైర్మన్ రాంబాబు శేష వస్త్రాలతో సత్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..