Benefits Of Hing: ఓర్నీ.. ఇంగువతో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా..?
ఇంగువను కూరలు, ఊరగాయల్లో వాడతారన్న విషయం తెలిసిందే. కేవలం రుచి మాత్రమే కాదు.. దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఇంగువను తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
భారతీయ మసాలా దినుసులలో ఇంగువ అత్యంత ముఖ్యమైనది. ఈ మసాలా దాని సువాసనకు మాత్రమే కాకుండా దాని ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. తెలుగు రాష్ట్రాల్లోని వంటల్లో దీనిని విరివిగా వాడటానికి కారణం ఇదే. ఆయుర్వేద నిపుణులు కూడా మీ ఆహారంలో ఇంగువను చేర్చుకోవాలని చెబుతున్నారుమనం ఆహారంలో ఇంగువను ఎందుకు చేర్చుకోవాలో ఆయుర్వేద నిపుణుల నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంగువ తినడం వల్ల ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద, గట్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ డింపుల్ జాంగ్రా అంటున్నారు. ముఖ్యంగా పొట్టకు ఇది చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…
జీర్ణక్రియ సమస్యలకు చెక్
జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఇంగువ తినాలని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ డింపుల్ జాంగ్రా చెబుతున్నారు. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడం ద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది గుండె ఆరోగ్యానికి, కంటి వ్యాధులపై పోరాడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు, రక్తపోటు, కాలేయ పనితీరు, మూత్రపిండాల సంబంధిత సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.
మనం రోజూ ఎంత ఇంగువ తీసుకోవాలి?
డాక్టర్ డింపుల్ జాంగ్రా మాట్లాడుతూ మీరు రోజూ మీ ఆహారంలో దాదాపు 250 మి.గ్రా ఇంగువను చేర్చుకోవచ్చు. అయితే, రక్తస్రావం, మూర్ఛ, కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఇంగువ తినడం మానుకోవాలని డాక్టర్ సూచించారు.
ఇంగువ ఎలా తీసుకోవాలి…
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం.. గోరువెచ్చని నీటితో చిటికెడు ఇంగువ వేసి ఖాళీ కడుపుతో తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే, మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఇంగువ తీసుకునే ముందు ఖచ్చితంగా మీ వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..