Eating Eggs: గుడ్డులో పచ్చ సొన రోజూ తింటే ఏమైనా ప్రమాదమా.? నిపుణులు చెబుతోన్న ఆసక్తికర విషయాలు..
అయితే రోజూ గుడ్డు తినడంపై అనేక అపోహలు, సంశయాలు కూడా ఉన్నాయి. రోజులో ఎన్ని గుడ్లు తినాలి? గుడ్డులోని తెల్లసోన మాత్రమే తినాలని.. లోపలి పసుపు సొన తినకూడదని, అసలు గుడ్డే కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.. గుండె సంబంధ వ్యాధులకు కారణం అవుతుంది అసలు తినకూడదు.. వంటి చాలా వాదనలు ఉన్నాయి.
సండే లేదా మండే రోజూ తినండి గుడ్డు.. అంటూ యాడ్లు వస్తూ ఉంటాయి. నిజమే రోజూ గుడ్డు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిలో మాంసకృతులు, విటమిన్ డీ వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే రోజూ గుడ్డు తినడంపై అనేక అపోహలు, సంశయాలు కూడా ఉన్నాయి. రోజులో ఎన్ని గుడ్లు తినాలి? గుడ్డులోని తెల్లసోన మాత్రమే తినాలని.. లోపలి పసుపు సొన తినకూడదని, అసలు గుడ్డే కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.. గుండె సంబంధ వ్యాధులకు కారణం అవుతుంది అసలు తినకూడదని చాలా వాదనలు ఉన్నాయి. వీటిపై నిపుణులు చాలా ఏళ్లుగా సమాధానాలు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ చర్చనీయాంశమే.
రోజుకు ఒక గుడ్డు మంచిదే..
అయితే, మెక్‌మాస్టర్ యూనివర్సిటీ, హామిల్టన్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (PHRI) పరిశోధకుల బృందం రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఎటువంటి హాని కలిగించదని, అది శరీంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని పసుపు భాగం, పోషకాలు అధికంగా ఉండే ఫార్ములేషన్ గురించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పంచుకున్నారు.
View this post on Instagram
డాక్టర్ మాణిక్యం ఏం చెప్పారంటే..
‘దశాబ్దాలుగా, కొలెస్ట్రాల్ సమస్యల భయం చాలా మంది గుడ్ల వినియోగాన్ని తగ్గించారు. గుడ్లు కొలెస్ట్రాల్‌కు మూలం. సగటు పెద్ద గుడ్డు పచ్చసొనలో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందని పోషకాహార నిపుణులు అంచనా. శరీరంలోని చాలా కొలెస్ట్రాల్‌ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు.. కాలేయం ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్, కొవ్వులు ఉన్నప్పటికీ, రోజుకు ఒక గుడ్డు తినడం శరీరానికి మంచి చేస్తుంది. ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులకు దోహదం చేయదు’ అని డాక్టర్ మాణిక్యం వివరించారు.
గుడ్డులో ఏముంది..
ఒక గుడ్డులో 78 కేలరీలు ఉంటాయని డాక్టర్ మాణిక్యం వివరించారు. విటమిన్ డీ, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. అలాగే కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పచ్చసొనలో కంటికి ఆరోగ్యానికి సహాయపడే పదార్థాలు కూడా ఉన్నాయట. లుటీన్, జియాక్సంథిన్, ఇవి కంటిశుక్లం, మాక్యులార్ డిజెనరేషన్‌ను దూరం చేస్తాయని వివరించారు. ఈనేపథ్యంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇప్పుడు రోజుకు ఒక గుడ్డు (లేదా రెండు గుడ్లలోని తెల్లసొన)ను సిఫార్సు చేస్తోందని డాక్టర్ మాణిక్యం చెప్పకొచ్చారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..