superfoods: మీ వంటగదిలో ఉండే సూపర్ ఫుడ్స్ గురించి మీకు తెలుసా? ఇంతకాలం వాటిని గుర్తించక తప్పు చేశారు.. వెంటనే తెలుసుకోండి..

చాలా మంది ఇంటర్ నెట్ లో సూపర్ ఫుడ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇండియన్ కిచెన్ లో ఉండే సూపర్ ఫుడ్స్ గనిని ఏవరు పట్టించుకోరు. ఏళ్లుగా అవి మీ కంటి ముందరే ఉన్నా అవి సూపర్ ఫుడ్స్ తెలుసుకోలేరు.

superfoods: మీ వంటగదిలో ఉండే సూపర్ ఫుడ్స్ గురించి మీకు తెలుసా? ఇంతకాలం వాటిని గుర్తించక తప్పు చేశారు.. వెంటనే తెలుసుకోండి..
Super Food
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2023 | 8:40 PM

సూపర్ ఫుడ్స్.. ఇటీవల జనాలు కాలంలో ఎక్కువ సెర్చ్ చేస్తున్న పదం ఇది. ఈ సూపర్ ఫుడ్స్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచేందుకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలో ఆరోగ్యకర జీవ ప్రక్రియను నిర్వర్తించడంలో ఇవి బాగా ఉపకరిస్తాయి. వీటిల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఏవి సూపర్ ఫుడ్స్..

ఇదంతా సరే అసలు ఈ సూపర్ ఫుడ్స్ అంటే ఏమిటి? ఏయే పదార్థాలను సూపర్ ఫుడ్స్ అంటారు? అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. సాధారణంగా బ్లూబెర్రీస్, సాల్మన్, కాలే, అవకాడో వంటి కొన్ని రకాల ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. అయితే ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. వీటి ధర కూడా కొంచెం ఎక్కవగానే ఉంటుంది. మరి వీటిని ప్రత్యామ్నాయం ఏంటి? అనే ప్రశ్నకు న్యూట్రిషియనిస్ట్ లోవ్ నీత్ బాత్రా సమాధానం ఇస్తున్నారు. మన ఇంట్లోనే వంట  గదిలో ఈ సూపర్ ఫుడ్స్ వంటి ఆహార పదర్ధాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తన ఇస్టాగ్రామ్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఆయన షేర్ చేస్తూ.. ‘ చాలా మంది ఇంటర్ నెట్ లో సూపర్ ఫుడ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కానీ ఇండియన్ కిచెన్ లో ఉండే సూపర్ ఫుడ్స్ గనిని ఏవరు పట్టించుకోరు. ఏళ్లుగా అవి మీ కంటి ముందరే ఉన్నా అవి సూపర్ ఫుడ్స్ తెలుసుకోలేరు. వీటి ద్వారా ఆరోగ్యంతోపాటు ఖర్చు ఆదా అవుతుంది. వీటిని డైట్ లో చేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’. అని రాశారు.

న్యూట్రిషియనిస్ట్ లోవ్ నీత్ సూచించిన సూపర్ ఫుడ్స్..

సొరకాయ.. సొరకాయ ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.

 కొబ్బరి.. కొబ్బరిలో మానవ శరీరానికి ఉపయోగ పడే పోషకాలు చాలా ఉన్నాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే దీనిలో ని మాంగనీస్, ఓమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, సెలేనియమ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఓమేగా6 ఫ్యాటీ యాసిడ్స్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.

అమర్నాథ్ ఆకులు.. అమర్నాథ్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్ ఫ్లేషన్ ను తగ్గిస్తుంది. 100 గ్రాముల ఈ అమర్నాథ్ ఆకుల్లో కేవలం 23 కేలరీలు మాత్రమే ఉంటుంది. దీనిలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఆమ్లా.. ఆమ్లా అనేది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. దీనిని రోజూ తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఆమ్లాలో ఫినోలిక్ ఫైటో కెమికల్స్ ఉండే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, సీ పుష్కలంగా లభ్యమవుతుంది.

అశ్వగంధా.. అశ్వగంధాను భారతీయ జిన్సెంగ్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలుంటాయి. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో