Health: మంచి ఆరోగ్యానికి నానబెట్టిన గింజలూ ముఖ్యమే.. ఈ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోండి..

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కరోనా కారణంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. ఆహారంలో చిన్న మార్పులు ఆరోగ్యంలో పెద్ద మార్పు కలిగిస్తాయి. సంపూర్ణ పోషకాహారంతో రోజును ప్రారంభించడం...

Health: మంచి ఆరోగ్యానికి నానబెట్టిన గింజలూ ముఖ్యమే.. ఈ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోండి..
Dry Fruits
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 24, 2023 | 9:55 AM

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కరోనా కారణంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. ఆహారంలో చిన్న మార్పులు ఆరోగ్యంలో పెద్ద మార్పు కలిగిస్తాయి. సంపూర్ణ పోషకాహారంతో రోజును ప్రారంభించడం చాలా అవసరం. మనలో చాలా మంది పోషకాలు, ఖనిజాల లోపాలతో బాధపడుతుంటారు. ఇనుము, ఫోలేట్, విటమిన్ B12, విటమిన్ A లోపం రక్తహీనతకు కారణమవుతుంది. విటమిన్ డి లోపం పెద్దవారిలో అధికంగా కనిపిస్తోంది. ఇది కాల్షియం లెవెల్స్, రికెట్స్ వంటి ఎముకల సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. బాదం, జీడిపప్పు, వాల్‌నట్, వేరుశెనగ వంటి గింజల్లో విటమిన్ బీ, ఫోలేట్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నీటిలో నానబెట్టి తినడం వల్ల పోషకాలు శరీరానికి బాగా అందుతాయనింటున్నారు ఆరోగ్య నిపుణులు.

నానబెట్టిన విత్తనాలు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల పీసీఎఎస్, మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. 5-7 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయమే తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. రుతుక్రమ సమస్యల నుంచి ఎండుద్రాక్ష ఉపశమనం కలిగిస్తుంది. 6-8 నానబెట్టిన ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి, మరుసటి ఉదయం తినాలి. ఇది జుట్టు రాలడం, రోగనిరోధక సంబంధిత సమస్యలకు మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

నానబెట్టిన వాల్‌నట్‌లు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు మంచివి. వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలు, పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. జుట్టు, కండరాల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నానబెట్టిన అంజీర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పేగు ఆరోగ్య సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, సీనియర్ సిటిజన్లు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..