మీ పిల్లలు సన్నగా బరువు తక్కువగా ఉన్నారా.. వెంటనే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించండి..?
Childrens: ఆధునిక యుగంలో జీవన శైలి మారిపోవడంతో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో
Childrens: ఆధునిక యుగంలో జీవన శైలి మారిపోవడంతో చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇందులో వృద్ధులతో పాటు పిల్లలు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కానీ నేటి ఆహారం తల్లిదండ్రుల సమస్యలను పెంచుతోంది. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యానికి హానికరంగా భావించే జంక్ ఫుడ్స్‌ను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ చాలా మంది పిల్లలు సన్నగా తక్కువ బరువుతో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులు వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా సార్లు పిల్లల బరువు ఇతర కారణాల వల్ల పెరగదు. అనారోగ్యం కారణంగా కూడా పిల్లల బరువు పెరగదు. దీని కోసం వెంటనే డాక్టర్ లేదా నిపుణుడి సలహా తీసుకోవడం అవసరం. అంతేకాకుండా బరువు పెంచే సూపర్ ఫుడ్స్ తినిపించి పిల్లవాడి బరువుని సులువుగా పెంచవచ్చు. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.
1. అరటిపండు
అరటిపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కేలరీలు, ఐరన్‌తో నిండి ఉంటుంది. పిల్లలు వీటిని ఇష్టంతో తింటారు. బరువు పెరగడానికి అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు బేబీకి అరటిపండు షేక్, ఓట్స్ కూడా ఇవ్వవచ్చు.
2. పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులలో ప్రోటీన్ మాత్రమే కాకుండా కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బరువు పెరగడంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎముకలను బలపరిచే కాల్షియం పాల ఉత్పత్తులలో దండిగా ఉంటుంది. మీ బిడ్డకు పాలు తాగడం ఇష్టం లేకపోతే మీరు అతనికి వెన్న, నెయ్యి, పెరుగు, పనీర్ కూడా తినిపించవచ్చు.
3. గోధుమ గంజి
మీరు గోధుమలతో చేసిన పదార్థాలను పిల్లలకి తినిపిస్తే చాలా మంచిది. మీ బిడ్డ నమలగలిగితే, మీరు అతనికి గోధుమ రొట్టె తినిపించవచ్చు. గోధుమ గంజిలో పచ్చి కూరగాయలు కలిపి చిన్న పిల్లవాడికి తినిపించవచ్చు. దీంతో అతడు చాలా బలంగా తయారవుతాడు.
4. చికెన్
ఇందులో ఉండే ప్రొటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాదు ప్రొటీన్ల సాయంతో కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. మీరు మీ బిడ్డ నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే వారానికి రెండుసార్లు చికెన్ తినిపించండి. చికెన్ సూప్ కూడా తాగిపించవచ్చు. దీంతో అతడు తొందరగా బరువు పెరుగుతాడు.