వంటగదిలో ఉండే ఈ 7 పదార్థాలు అద్భుతం.. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో వ్యాధులకు పరిష్కారం..

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం మీ వంటగది అవసరమైన పోషకాల నిధి. వంటలలో ఉపయోగించే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఇక్కడ ఉంటాయి.

వంటగదిలో ఉండే ఈ 7 పదార్థాలు అద్భుతం.. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో వ్యాధులకు   పరిష్కారం..
Ayurvedic
Follow us

|

Updated on: Feb 01, 2022 | 2:45 PM

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం మీ వంటగది అవసరమైన పోషకాల నిధి. వంటలలో ఉపయోగించే అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఇక్కడ ఉంటాయి. ఈ మసాలా దినుసులు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ మసాలాలు బరువు తగ్గించడంలో, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఈ సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఉన్నాయి. ఈ మసాలాలు మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటి ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. అల్లం

దాదాపు ప్రతి భారతీయ వంటగదిలో ఉపయోగించే అత్యంత ప్రసిద్ధ సుగంధ ద్రవ్యాలలో అల్లం ఒకటి. ఇది ఆయుర్వేద చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఆహారంలో అల్లం చేర్చడమే కాకుండా అల్లంతో చేసిన టీని కూడా తీసుకోవచ్చు. ఇది జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్‌కి సహజ నివారణగా ఉపయోగపడుతుంది.

2. దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. జలుబుకు కారణమయ్యే వైరస్‌తో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

3. జీలకర్ర

జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ఇది గ్యాస్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.

4. ధనియాలు

ధనియాలు శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. కడుపులో అధిక వేడి కారణంగా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇది కడుపు ఉబ్బరం మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆకలిని పెంచుతుంది కడుపులో హానిచేసే పురుగులను చంపుతుంది.

5. ఇంగువ

ఇంగువ వాసన ఘాటుగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది తోడ్పడుతుంది. ఇందులోని గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉబ్బరం, అపానవాయువు, పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు, త్రేనుపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

6. పసుపు

పసుపును చాలా వంటలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేద చికిత్సలలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

7. ఏలకులు

ఏలకులను తీపి, రుచికరమైన వంటలలో ఉపయోగిస్తారు. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా కూడా వాడుతారు. టీ రుచిని మెరుగుపరచడానికి కొన్ని ఏలకులు కలపవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Viral Photos: ఈ కోటలపై నుంచి చూస్తే సముద్ర తీర అందమైన దృశ్యాలను వీక్షించవచ్చు..

Vastu Tips: వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఈ 5 వాస్తు చిట్కాలు తెలుసుకోండి..?

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ షెడ్యూల్‌ని ప్రకటించిన బీసీసీఐ.. 8 నగరాల్లో మ్యాచ్‌లు.. ఎప్పటినుంచంటే..?

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..