AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Drinks: సుఖవంతమైన నిద్రకోసం పడుకునే ముందు ఈ హెల్తీ డ్రింక్స్‌..?

Healthy Drinks: ఆధునిక ప్రపంచంలో బిజీ షెడ్యూల్‌ కారణంగా సమయం దొరకడమే కష్టంగా మారుతోంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

Healthy Drinks: సుఖవంతమైన నిద్రకోసం పడుకునే ముందు ఈ హెల్తీ డ్రింక్స్‌..?
Healthy Drinks
uppula Raju
|

Updated on: Feb 01, 2022 | 3:29 PM

Share

Healthy Drinks: ఆధునిక ప్రపంచంలో బిజీ షెడ్యూల్‌ కారణంగా సమయం దొరకడమే కష్టంగా మారుతోంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో జీర్ణ సమస్యలు, సమయపాలన లేని నిద్ర, గ్యాస్‌ సమస్యలు మొదలైనవి ఉన్నాయి. మంచి నిద్ర మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీరు చురుకుగా ఉండటమే కాకుండా రోజంతా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర కోసం మీరు మీ ఆహారంలో అనేక రకాల పానీయాలను చేర్చుకోవచ్చు. ఇందులో చమోమిలే టీ, పసుపు పాలు మొదలైనవి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. చామంతి టీ

చామంతి టీ సహజ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని బాగా నిద్రపోయేలా ప్రేరేపిస్తుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ టీ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ టీ తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో నీటిని మరిగించి దాంట్లో కొద్దిగా చామంతిలను వేయాలి. కొద్దిసేపు మరిగించాలి. దీనికి తేనె, అల్లం, పుదీనా ఆకులను కలిపి తాగితే సూపర్‌గా ఉంటుంది.

2. పసుపుతో కుంకుమపువ్వు పాలు

పడుకునే ముందు పాలు తాగితే నిద్ర కమ్ముకొస్తుంది. ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది ఇది సహజ నిద్రని ప్రేరేపిస్తుంది ఒత్తిడి, టెన్షన్‌లని తగ్గిస్తుంది. నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది. పసుపును ప్రధానంగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి నిద్రకు తోడ్పడతాయి. పాలలో కుంకుమపువ్వు కలిపినప్పుడు నిద్రలేమి, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు, కుంకుమపువ్వు కలిపిన వేడి పాలు రాత్రిపూట మంచి పానీయంగా చెప్పవచ్చు.

3. అశ్వగంధ టీ

అశ్వగంధ ఉత్తమ ఆయుర్వేద మూలికలలో ఒకటి. అశ్వగంధ ఒత్తిడి-ఉపశమన లక్షణాలను తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది ఒత్తిడి హార్మోన్ అని పిలువబడే కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఒక కప్పు అశ్వగంధ టీతో నిద్రలేమిని అధిగమించవచ్చు. ఈ టీ చేయడానికి ఒక గిన్నెలో నీటిని మరిగించి దానికి అశ్వగంధ వేర్లు వేసి 2-3 నిమిషాలు వేడి చేయాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని జల్లెడలో వడకట్టి నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. మంచి నిద్ర తరుముకొస్తుంది.

Winter Drinks: చలికాలంలో ఈ పానీయాలు ఒక్కసారైనా తాగాలి.. వివిధ ప్రాంతాల స్పెషల్‌ డ్రింక్స్‌

వంటగదిలో ఉండే ఈ 7 పదార్థాలు అద్భుతం.. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో వ్యాధులకు పరిష్కారం..

Viral Photos: ఈ కోటలపై నుంచి చూస్తే సముద్ర తీర అందమైన దృశ్యాలను వీక్షించవచ్చు..