AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Drinks: చలికాలంలో ఈ పానీయాలు ఒక్కసారైనా తాగాలి.. వివిధ ప్రాంతాల స్పెషల్‌ డ్రింక్స్‌

Winter Drinks: సుగంధ ద్రవ్యాలు, మూలికలను ఉపయోగించడంలో భారతీయులు చాలా నిష్ణాతులు. సనాతన ఆయుర్వేద ధర్మంలో వీటి గురించి ఎప్పుడో ప్రస్తావించారు.

Winter Drinks: చలికాలంలో ఈ పానీయాలు ఒక్కసారైనా తాగాలి.. వివిధ ప్రాంతాల స్పెషల్‌   డ్రింక్స్‌
Winter Drinks
uppula Raju
|

Updated on: Feb 01, 2022 | 3:04 PM

Share

Winter Drinks: సుగంధ ద్రవ్యాలు, మూలికలను ఉపయోగించడంలో భారతీయులు చాలా నిష్ణాతులు. సనాతన ఆయుర్వేద ధర్మంలో వీటి గురించి ఎప్పుడో ప్రస్తావించారు. వీటిని వివిధ వంటకాల తయారీలో కాకుండా ఎన్నో వ్యాధులని నయం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. చలికాలంలో వీటితో రకరకాల టీలు, పానీయాలు తయారుచేసుకొని తాగుతారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో కొన్ని ప్రసిద్ధ శీతాకాలపు పానీయాలు ఉన్నాయి. వీటిని ఈ సీజన్‌లో ఒక్కసారైనా తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. కశ్మీరి టీ

కశ్మీరి టీని జీడిపప్పు, ఖర్జూరాలు వంటి ఎండిన పండ్లతో తయారు చేస్తారు. గ్రీన్ టీ ఆకులు, కుంకుమపువ్వు, దాల్చినచెక్క, ఏలకులు, లవంగాల మిశ్రమాన్ని కలుపుతారు. దీంతో ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా ఫేమస్‌ టీ. చలికాలం మీరు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది.

2. సాంబార్‌

ఈ సంప్రదాయ దక్షిణ భారతీయ పానీయం అల్లం, సుగంధ ద్రవ్యాలు, చింతపండు, కరివేపాకు, ఆవాలు గింజలతో కూడిన కూరగాయల మిశ్రమం. ఈ రుచికరమైన పానీయం చల్లని వాతావరణానికి గొప్ప ఎంపికని చెప్పవచ్చు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, మూలికల కలయిక శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. గొంతు నొప్పి, ఫ్లూ, జలుబు, దగ్గును నయం చేస్తుంది.

3. మసాలా టీ

లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, జాజికాయ, తులసి ఆకులు వంటి తేలికపాటి మసాలా దినుసులను కలిపి ఈ దేశీ టీ తయారుచేస్తారు. కరోనా సమయంలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్లాసిక్ టీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ టీలో అనేక రకాల మసాలాలు ఉపయోగించడం వల్ల శీతాకాలంలో ఇది మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది.

4. పసుపు పాలు

ఈ పానీయం యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడి ఉంటుంది. ఇది శరీర నొప్పిని నయం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది గొంతు నొప్పి, జలుబు దగ్గు, జ్వరం నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ పానీయం యాంటీవైరల్, యాంటీకాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.

5. మిల్లెట్ రాబ్

ఈ క్లాసిక్ డ్రింక్ రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందింది. దీనిని మిల్లెట్ పిండి, నెయ్యి, బెల్లం, అల్లం, ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ షెడ్యూల్‌ని ప్రకటించిన బీసీసీఐ.. 8 నగరాల్లో మ్యాచ్‌లు.. ఎప్పటినుంచంటే..?

Vastu Tips: వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఈ 5 వాస్తు చిట్కాలు తెలుసుకోండి..?

Viral Photos: ఈ కోటలపై నుంచి చూస్తే సముద్ర తీర అందమైన దృశ్యాలను వీక్షించవచ్చు..