AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall: ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం తగ్గట్లేదా.? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి..

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టురాలడం ఒకటి. మారిన వాతావరణం, కాలుష్యంతో కూడుకున్న నీరు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, వాయు కాలుష్యం ఇలా కారణం ఏదైనా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు మార్కెట్లో లభించే రకరాల షాంపూలు, ఆయిల్స్‌ను ఉపయోగిస్తున్నారు...

Hair Fall: ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం తగ్గట్లేదా.? ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి..
Hair Fall
Narender Vaitla
|

Updated on: Apr 15, 2024 | 1:00 PM

Share

ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టురాలడం ఒకటి. మారిన వాతావరణం, కాలుష్యంతో కూడుకున్న నీరు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, వాయు కాలుష్యం ఇలా కారణం ఏదైనా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు మార్కెట్లో లభించే రకరాల షాంపూలు, ఆయిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఎన్నిరకాల ప్రొడక్ట్స్‌ ఉపయోగించినా కొందరిలో మాత్రం ఈ సమస్య తగ్గదు. అయితే కొన్ని సహజ చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడానికి అడ్డుకట్ట వేయొచ్చు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సమ్మర్‌లో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు, జుట్టును సిల్కీగా చేస్తుంది. అలాగే ప్రతీ రోజూ కలబందను ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. షాంపూతో తలస్నానం చేసే 30 నిమిషాల ముందు అలోవెరా జెల్‌ని మొత్తం జుట్టుకు పట్టించాలి. అనంతరం తలను వాష్‌ చేసుకుంటే సరిపోతుంది.

* వెంట్రుకలకు పోషణ అందించడంలో కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం జుట్టుకే కాకుండా స్కల్‌ చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రతీరోజూ కొబ్బరి నూనెతో తల మసాజ్‌ చేసుకోవడం వల్ల జుట్టుకు బలం చేకూరడంతో, జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

* గుడ్డు, ఆలివ్ ఆయిల్ మిశ్రమం జుట్టు రాలడాన్ని నివారించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందుకోసం మొదట ఒక గిన్నెలో కోడిగుడ్డును పగలకొట్టాఇల. అనంతరం ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కలపాలి. రెండింటినీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం జుట్టును నీటితో వాష్‌ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

* మెంతులు కూడా జుట్టు రాలే సమస్యకు మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మెంతి గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టుకు బాగా అప్లై చేయాలి. అనంతరం 30 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..