- Telugu News Lifestyle Amazing Health Benefits of Lotus Flower Roots, check here is details in Telugu
Lotus Flower Root Uses: తామర పువ్వు, గింజలతోనే కాదు.. వేర్లతో కూడా బోలెడన్ని బెనిఫిట్స్!
చెరువుల్లో, కాలవల్లో, మురికి గుంటల్లో కనిపించే తామర పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వాటితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చని తెలుసుకున్నాం. తామర గింజల్ని కూడా ఆహారంలో చేర్చుకున్నాం. ఇప్పుడు తామర పువ్వు వేర్లతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద వయసు కలిగిన వారు షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే..
Updated on: Apr 15, 2024 | 1:15 PM

చెరువుల్లో, కాలవల్లో, మురికి గుంటల్లో కనిపించే తామర పువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వాటితో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చని తెలుసుకున్నాం. తామర గింజల్ని కూడా ఆహారంలో చేర్చుకున్నాం. ఇప్పుడు తామర పువ్వు వేర్లతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్ద వయసు కలిగిన వారు షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే.. అంత త్వరగా తగ్గదు. అయితే తామర పువ్వు వేర్లతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ను క్రంటోల్ చేయవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.

చాలా మంది ఇప్పుడు అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇలాంటి వారు మీ డైట్‌లో తామర పువ్వు వేర్లను చేర్చుకుంటే.. వెయిట్ లాస్ అవ్వొచ్చని అంటున్నారు. ఇందులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను కూడా అదుపు చేస్తుంది.

తామర పువ్వు వేర్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చట. ఇందులో ఉండే కొన్ని గుణాలు చిరాకు, ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని అదుపు చేస్తుంది. అదే విధంగా పిల్లల్లో జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

అలా విధంగా తామర పువ్వ వేర్లను ఉపయోగించే జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఈ వేర్లలో ఫైబర్ కంటెంట్ అనేది మెండుగా ఉంటుంది. కాబట్టి దీంతో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే.. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.




