- Telugu News Lifestyle These foods should be consumed strictly to keep the muscles strong, check here is details
Foods for Muscle Strong: కండరాలు బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ బెస్ట్!
శరీరంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. శరరీ భాగాలు కూడా హెల్దీగా ఉండాలి. వీటికి ఎన్నెన్నో రకాల పోషకాలు అవసరం అవుతాయి. శరీరంలో మంచి ఆకృతిలో ఉండాలంటే.. కండరాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మగవారికి కండారాలు కీలక పాత్ర పోషిస్తాయి. బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ వంటివి పెంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఇందు కోసం ఖర్చు పెట్టి.. వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కేవలం కసరత్తులు చేస్తేనే కండలు పెరిగిపోవు. కండరాలు పెరగడానికి, బలంగా ఉండటాని ఆహారం కూడా కావాలి. మీ డైట్‌లో ప్రోటీన్లు..
Updated on: Apr 15, 2024 | 2:12 PM

శరీరంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. శరరీ భాగాలు కూడా హెల్దీగా ఉండాలి. వీటికి ఎన్నెన్నో రకాల పోషకాలు అవసరం అవుతాయి. శరీరంలో మంచి ఆకృతిలో ఉండాలంటే.. కండరాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మగవారికి కండారాలు కీలక పాత్ర పోషిస్తాయి. బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ వంటివి పెంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఇందు కోసం ఖర్చు పెట్టి.. వ్యాయామాలు చేస్తూ ఉంటారు.

కేవలం కసరత్తులు చేస్తేనే కండలు పెరిగిపోవు. కండరాలు పెరగడానికి, బలంగా ఉండటాని ఆహారం కూడా కావాలి. మీ డైట్‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు ఉండేలా చూసుకోడాలి. అదే విధంగా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి.

కండరాల పెరుగుదలలో సాల్మన్, మాకిరెల్, ట్యూనా వంటి చేపలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మజిల్ వెయిట్ గెయిన్ త్వరగా పెరిగేలా చూస్తాయి.

అదే విధంగా చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల కూడా కండరాలు బరువు పెరగడానికి, బలంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. పప్పు దినుసులు, పెసలు, ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు కూడా కండరాల పెరుగుదలకు సహాయ పడతాయి.

బ్రౌన్ రైస్‌లో కూడా పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది తీసుకున్నా మంచిది. గోధుమలతో చేసే ఆహారాలు, కార్బోహైడ్రేట్లు, మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, డ్రై ఫ్రూట్స్, తీసుకోవడం వల్ల కూడా కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.




