kidney stone: కిడ్నీలో రాళ్లకు మీరు చేసే ఈ తప్పులే కారణం.. అవేంటంటే..
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి, శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. మరి ఇంతటి ముఖ్యమైన అవయవం గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా చెప్పండి. కిడ్నీలో రాళ్లు చాలా మందిలో ఎదురయ్యే ప్రధాన సమస్య. దీనివల్ల కడుపు నొప్పి మొదలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కిడ్నీలో రాళ్లు...
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి, శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. మరి ఇంతటి ముఖ్యమైన అవయవం గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా చెప్పండి. కిడ్నీలో రాళ్లు చాలా మందిలో ఎదురయ్యే ప్రధాన సమస్య. దీనివల్ల కడుపు నొప్పి మొదలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి పలు పలు కారణాలు ఉన్నాయి. వీటిలో మనకు తెలిసి చేసే తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం తక్కు నీరు తాగడం. శరీరంలో నీరు లేకపోవడం వల్ల, మూత్రం మందంగా మారుతుంది, ఇది రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే రోజూ తగిన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. ఇక ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తాగాలి.
* కాల్షియం లోపం కారణంగా కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు, దీని కారణంగా శరీరానికి అన్ని పోషకాలు సులభంగా అందుతాయి.
* అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు కాల్షియంను బయటకు పంపేలా చేస్తాయి. ఈ అదనపు కాల్షియం కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. ఉప్పును తక్కువగా తీసుకోవాలి.
* మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వాస్తవానికి, అదనపు ప్రోటీన్ శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది, ఇది రాళ్లకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
* అధిక బరువు లేదా ఊబకాయం కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం, రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది, ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.
* నిపుణుల అభిప్రాయం ప్రకారం, విత్తనాలు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వంకాయ, టొమాటో వంటి గింజలు కలిగిన కూరగాయలలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. అందుకే వీటిని తక్కువగా తీసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..