Monsoon Hair Fall Tips: ఈ 5 చిట్కాలు పాటిస్తే జుట్టు రాలకుండా ఉంటుంది..! ఏంటో తెలుసుకోండి..

Monsoon Hair Fall Tips : వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఆందోళన వల్ల చాలామందికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

Monsoon Hair Fall Tips: ఈ 5 చిట్కాలు పాటిస్తే జుట్టు రాలకుండా ఉంటుంది..! ఏంటో తెలుసుకోండి..
Hair Fall Tips
Follow us
uppula Raju

|

Updated on: Aug 12, 2021 | 10:53 AM

Monsoon Hair Fall Tips : వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, మానసిక ఆందోళన వల్ల చాలామందికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది. స్త్రీ, పురుషులు అనే బేధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. జుట్టు మొత్తం పలుచగా మారుతుంది. రెయినీ సీజన్‌లో ఈ సమస్య నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఈ 5 పద్దతులను పాటించండి. మంచి ఫలితం ఉంటుంది. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.

1. మొదటగా చెప్పాలంటే మెడిటేషన్ ద్వారా జుట్టు రాలడం అరికట్టవచ్చు. మీరు ఎక్కువ ఒత్తిడికి, టెన్షన్ కు గురవ్వడం వల్లే మీ జుట్టు రాలిపోతుంది. అందువల్ల మెడిటేషన్ చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారి జుట్టు రాలడం ఆగిపోతుంది.

2. గ్రీన్ టీ తాగడం వల్ల హెయిర్ రూట్స్ కు బలాన్ని అందిస్తుంది. అలాగే కాస్త గోరువెచ్చని గ్రీన్ టీ అంటే వేడి నీళ్లతో ఒక రెండు గ్రీన్ టీ బ్యాగులు వేసి (చక్కెర వేయకండి) తయారు చేసిన మిశ్రమంతో మీ జుట్టుకు మర్దన చేయండి. తర్వాత తలస్నానం చేయండి.

3. గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్‌ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి కొద్దిసేపు వేచి ఉండాలి. తర్వాత తలస్నానం చేయాలి. లేదంటే ఆలివ్ ఆయిల్‌ను రాత్రిపూట జుట్టుకు రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసినా సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ విధంగా ప్రయత్నిస్తే జుట్టు పెరుగుదలలో ఆశించిన ఫలితాలు వస్తాయి.

4. రాత్రి మీరు నిద్రపోయేముందు వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం లేదా అల్లం రసంతో మీ జుట్టుకు మర్దన చేయండి. ఉదయం లేచాక తలస్నానం చేయండి.

5. ఆలివ్, కొబ్బరి, కనోల నూనెలను కాస్త వేడి చేయండి. చల్లగ అయ్యాక జుట్టుకు మసాజ్ చేయండి. తర్వాత తలస్నానం చేయండి. ఇది ఒక మంచి షాంప్ లాగ పని చేస్తుంది.

Hyderabad: మనోడు మహా ముదురు.. సెంచరీ దాటినా చోరీలు ఆపలేదు.. 22 సార్లు జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మారలేదు..

Viral Video: జిరాఫీని వేటాడి మట్టుబెట్టిన సింహం.. మృగరాజు వేట చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

Viral Pic: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది కనిపెట్టలేకపోయారు!