AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట భోజనం త్వరగా చేస్తే.. ఐదు ఉత్తమ ప్రయోజనాలు.. ఏంటో తెలుసుకోండి..

Eating Food Early : మనమందరం అల్పాహారం సమయానికి తింటాం. కానీ సమయానికి భోజనం మాత్రం చేయం. రాత్రి భోజనం ఆలస్యంగా

రాత్రిపూట భోజనం త్వరగా చేస్తే.. ఐదు ఉత్తమ ప్రయోజనాలు.. ఏంటో తెలుసుకోండి..
Dinner
uppula Raju
|

Updated on: May 10, 2021 | 12:31 PM

Share

Eating Food Early : మనమందరం అల్పాహారం సమయానికి తింటాం. కానీ సమయానికి భోజనం మాత్రం చేయం. రాత్రి భోజనం ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి హానికరం. చురుకుగా, శక్తివంతంగా ఉండటానికి రాత్రి 7-7: 30 గంటలకు తినాలి. సమయానికి తినడం వల్ల మీ శరీరం అద్భుతాలు చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మీరు తినడానికి, పడుకోవడానికి మధ్య వ్యత్యాసాన్ని కొనసాగించడం మంచిది. ఎందుకంటే మీరు పడుకున్న తర్వాత ఆహారం సరిగా జీర్ణం కాలేదనుకో కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ ఉబ్బరం వస్తుంది.

2. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు అర్థరాత్రి భోజనం చేస్తే కేలరీలు సరిగా జీర్ణమవవు. అవి ట్రైగ్లిజరైడ్స్ గా మారుతాయి, ఇది కొవ్వు ఆమ్లం ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. సమయానికి ఆహారాన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది సమయానికి తినడం వల్ల శరీరం తిన్న ఆహారాన్ని సరిగ్గా వాడుకుంటుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. జీవక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆహారం శక్తిగా మారి కేలరీలను బర్న్ చేస్తుంది.

4. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోయినప్పుడు డయాబెటిస్ వస్తుంది. మీరు సమయానికి ఆహారం తింటే గ్లూకోజ్‌గా మార్చడానికి తగినంత సమయం ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

5. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది మీరు ఆలస్యంగా ఆహారం తింటే మీ నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే మీరు సమయానికి తింటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అప్పుడే మీరు చురుకుగా ఉంటారు.

Telangana police: తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..

కొత్తగా బిల్డింగ్ కడుతుంటే దాని చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారో తెలుసా..అసలు విషయం ఇదే..

జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత్.. స్పష్టం చేసిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ

Young Doctor Dies: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం.. కూర్చున్నచోటే కుప్పకూలిన యువ డాక్టర్.. గంటల వ్యవధిలో గాలిలో కలిసిన ప్రాణాలు