కొత్తగా బిల్డింగ్ కడుతుంటే దాని చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారో తెలుసా..అసలు విషయం ఇదే..

సాధారణంగా పట్టణాల్లో ఎత్తైన బిల్డింగ్స్.. లేదా నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ ప్రదేశం చుట్టూ గ్రీన్ క్లాత్ కట్టి ఉంటుంది. నగరాల్లో పెద్ద క్రేన్లు,

కొత్తగా బిల్డింగ్ కడుతుంటే దాని చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారో తెలుసా..అసలు విషయం ఇదే..
Green Color Cloth
Follow us

|

Updated on: May 10, 2021 | 12:08 PM

సాధారణంగా పట్టణాల్లో ఎత్తైన బిల్డింగ్స్.. లేదా నిర్మాణ పనులు జరుగుతుంటే ఆ ప్రదేశం చుట్టూ గ్రీన్ క్లాత్ కట్టి ఉంటుంది. నగరాల్లో పెద్ద క్రేన్లు, పెద్ద యాంత్రాల సహయంతో భవనాలు నిర్మిస్తుంటారు. అయితే కొత్త బిల్డింగ్ కట్టెటప్పుడు దాని చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారు అనే సందేహం చాలా మందికి రావచ్చు. ఇందుకు గల సందేహలు వచ్చిన ఎవరిని అడిగి స్పష్టమైన సమాదానం మాత్రం చెప్పరు. మరీ అలా భవనాల చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారో తెలుసుకుందామా.

భవనాల చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ కట్టడానికి గల కారణం.. ఎత్తులో పనిచేసే కార్మికులు దృష్టి కోల్పోకూడదని.. లేదా అతని సడెన్ గా ఎత్తులో నుంచి చూడడం వలన అతను పరధ్యానంలోకి వెళ్ళడం అతని ప్రాణాలకే ప్రమాదమని.. అందుకే ఇలా వస్త్రాలను కడుతుంటారని కొంతమంది చెబుతుంటారు. అలాగే ఎక్కువగా ప్రజల దృష్టి భవనాలపై పడకూడదని అందుకే ఆ క్లాత్ వాడుతుంటారని చెబుతుంటారు. కానీ అసలు కారణం వేరే ఉంది. భవన నిర్మించే క్రమంలో దుమ్ము, సిమెంట్ భారీ మొత్తంలో నిర్మాణ స్థలంలో ఎగసిపడుతుంటాయి. దీంతో చుట్టూ పక్కల నివసించే ప్రజలకు ఇది పెద్ద సమస్యగా మారతుంది. దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద పెద్ద భవనాలను నిర్మించేప్పుడు వాటి చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ కడుతుంటారు. దీని వలన అక్కడ ఏర్పడే దుమ్ము, ధూళీ బయటకు రావు.

అయితే కేవలం ఆకుపచ్చ రంగును మాత్రమే ఎందుకు వాడతారు అనే సందేహం కూడా రావచ్చు. ఇందుకు కారణం ఉంది. గ్రీన్ కలర్.. ఎంత దూరం నుంచైనా కనిపిస్తుంది. అలాగే రాత్రి సమయంలో దీని కాంతి స్వల్పంగా ఉంటుంది. ఈ కారణాలతోనే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు గ్రీన్ కలర్ క్లాత్ వాడుతుంటారు.

Also Read: కంగనాకు మరోసారి దెబ్బ.. ఆమె పెట్టిన పోస్ట్‏ను డెలీట్ చేసిన ఇన్‏స్టాగ్రామ్.. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఏం రాసిందంటే..

Happy Birthday Namitha: హీరోయిన్ నమిత పుట్టిన రోజు నేడు.. ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..