Raisins: ప్రతిరోజూ కిస్మిస్ తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి..
కిస్మిస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఇంట్లో ఎలాంటి స్వీట్లు తయారు చేసినా అందులో కిస్మిస్ ఉండాల్సిందే. పరామాన్నం, పాయసం, ఇతర స్వీట్లో కిస్మిస్ వేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అలా కాకుండా నేరుగా తీసుకుంటే మరింత మంచిది. డ్రై ఫ్రూట్స్‌లో కిస్మిస్ కూడా ఒకటి. దీన్ని సూపర్ నట్‌గా చెబుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో లభిస్తాయి. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఈ కిస్మిస్‌లను సరైన సమయంలో తింటే..

కిస్మిస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ఇంట్లో ఎలాంటి స్వీట్లు తయారు చేసినా అందులో కిస్మిస్ ఉండాల్సిందే. పరామాన్నం, పాయసం, ఇతర స్వీట్లో కిస్మిస్ వేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అలా కాకుండా నేరుగా తీసుకుంటే మరింత మంచిది. డ్రై ఫ్రూట్స్‌లో కిస్మిస్ కూడా ఒకటి. దీన్ని సూపర్ నట్‌గా చెబుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో లభిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. కిస్మిస్ తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిస్మిస్‌లను ఉదయం, మధ్యాహ్నం తింటే చాలా మంచిది. ఈ కిస్మిస్‌లను సరైన సమయంలో తింటే.. మరిన్ని ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఏ సమయంలో తినాలి? తింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
కిస్మిస్‌లను ఉదయం పూట తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడటం వల్ల త్వరగా రోగాలు అనేవి ఎటాక్ కాకుండా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
వెయిట్ లాస్:
కిస్మిస్‌లను ఉదయం పూట తినడం వల్ల అధిక బరువు, ఊబకాయం తగ్గేందుకు సహాయ పడతాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపును నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం చాలా తక్కువగా తీసుకుంటారు. జీవక్రియను కూడా పెంచుతాయి.
చర్మం ఆరోగ్యం:
చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఉదయం ఓ నాలుగు కిస్మిస్‌లను నమిలి తినడం వల్ల చర్మం ఫ్రెష్‌గా ఉంటుంది. వీటిని తినడం వల్ల చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు దూరముతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. సూక్ష్మ క్రిములు బయటకు పోతాయి.
వీటి ముప్పు తగ్గుతుంది:
కిస్మిస్‌లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ని బయటకు పంపుతాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె జబ్బులు రావు. కిస్మిస్‌లను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి. శరీరంలో ఉండే వాపు సమస్యలను కూడా తగ్గిస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








