Sukhasana : యోగాసనాలలో అతి సులభమైన ఆసనం సుఖాసనం.. దీనివల్ల కలిగిప్రయోజనాలు అద్భుతం..

Sukhasana : చాలా మందికి యోగ ఏ సమయంలో ఎక్కడ ఎలా చేయాలని సందేశం ఉంది. అయితే యోగాను ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఉదయం , సాయంత్రం కూడా చేయవచ్చు. అయితే సాయంత్రం చేస్తే .. మధ్యాహ్నం ఆహారం...

Sukhasana : యోగాసనాలలో అతి సులభమైన ఆసనం సుఖాసనం.. దీనివల్ల కలిగిప్రయోజనాలు అద్భుతం..
Sukhasana
Follow us

|

Updated on: Apr 02, 2021 | 1:08 PM

Sukhasana : చాలా మందికి యోగ ఏ సమయంలో ఎక్కడ ఎలా చేయాలని సందేశం ఉంది. అయితే యోగాను ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఉదయం , సాయంత్రం కూడా చేయవచ్చు. అయితే సాయంత్రం చేస్తే .. మధ్యాహ్నం ఆహారం తింటాం కనుక కడుపు ఫుల్ గా ఉంది.. యోగా మీద అంతగా దృష్టి పెట్టలేరు.. అందుకనే ఆరోగ్య పరంగా ఉదయం యోగాభ్యాసం చాలా మందింది. అయితే ఉదయం కుదరక పొతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు.. దీని వలన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. ఏది ఏమైనా సాధన చేయడానికి శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగాకి మించినది మరొకటి లేదు.. ఈరోజు సుఖాసనం దాని ఉపయోగాలు తెలుసుకుందాం..!

సుఖ్’ అంటే జాయ్(సంతోషం). సుఖాసన అనేది ‘సుఖం’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీనర్ధం తేలిక లేదా ఇష్టమైన అని, ‘ఆసన’ అంటే భంగిమ అని అర్ధం. ఈ ఆసనం పేరుకుతగినట్లుగానే ఈజీగా ఏ వయసువారైనా వేయవచ్చు.

సుఖాసనం వేయడానికి పధ్ధతి:

చాపపై కూర్చోని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి.

తరువాత కాళ్ళను మడచి కూర్చోవాలి.

వెన్నుముక నిఠారుగా ఉండేట్లుగా చూడాలి.

ఇలా సుఖంగా సౌకర్యంగా వెన్నె నిఠారుగా ఉంచి ఎంతసేపైనా ఈ ఆసనంలో ఉండవచ్చు.

అయితే భుజాలను చక్కగా స్తిఫ్ట్ గా ఉంచాలి. సౌకర్యంగా ఉన్నంత సేపూ ఈ భంగిమలో కూర్చోవచ్చు.

ఈ ఆసనం వల్ల ప్రయోజనాలు:

మనసుకి ప్రశాంత నిస్తుంది. శరీర కదలిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. వెన్నె కు శక్తి కలుగుతుంది. త్వరగా అలసట లేకుండా చేస్తుంది. శరీరం శక్తిని పుంజుకుంది అన్న భావన కలుగజేస్తుంది.

Also Read: ఇంటర్, డిగ్రీ అర్హత ఉందా..! భారీ వేతనాలతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Karthika Deepam Serial: కార్తీక్ కోసం మళ్ళీ కుట్రకు తెరలేపిన మోనిత.. పిల్లల భవిష్యత్ కోసం డాక్టర్ బాబు అనూహ్య నిర్ణయం..