AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pattu Sarees: డ్రై క్లీనింగ్ అవసరం లేకుండా.. ఇంట్లోనే పట్టుచీరలను పదిలంగా ఉతుక్కోవచ్చు .. అది ఎలా అంటే..!

Pattu Sarees: భారతీయ సంప్రదాయంలో చీరలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, పంక్షన్లు, శుభకార్యాలు ఇలా ఏమి వచ్చినా పట్టుచీరలు ధరించడానికి..

Pattu Sarees:  డ్రై క్లీనింగ్ అవసరం లేకుండా.. ఇంట్లోనే పట్టుచీరలను పదిలంగా ఉతుక్కోవచ్చు .. అది ఎలా అంటే..!
Pattu Sarees Cleaning
Surya Kala
|

Updated on: Apr 02, 2021 | 11:42 AM

Share

Pattu Sarees: భారతీయ సంప్రదాయంలో చీరలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, పంక్షన్లు, శుభకార్యాలు ఇలా ఏమి వచ్చినా పట్టుచీరలు ధరించడానికి ఇష్టపడతారు. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. ఇక ఆధునిక ప్రపంచంలో పట్టు చీరల తయారీకి మగ్గాలను, మిషనరీ రెండిటిని వినియోగిస్తున్నారు. నాణ్యత కొరకు మగ్గాలపై నేయబడిన పట్టుచీరలకు నేటికీ గిరాకీ అధికంగా ఉంది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు చీరల ధరలు కూడా ఎక్కువే.. అయితే వీటి ధర ఎక్కువ.. ఇక పట్టు చీరలు పదిలంగా ఉండాలంటే ఏమి చెయ్యాలో తెలుసుకుందాం..ముఖ్యంగా వాటిని ఉతికేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం..!

పట్టుచీరలు ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

*పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమ్మోనియం వాడాలి. *చీరను మొదటిసారి ఉతికేటప్పుడు నీళ్ళలో కొంచెం ఉప్పు వేసీ ఆ నీటిలో నానబెట్టాలి. తర్వాత చల్లని నీటిలో బాగా జాడించి నీడలో ఆరబెట్టాలి. *మొదట్లోనే సబ్బు వాడకూడదు. ఒకటి, రెండు సార్లు ఉతికాక అప్పుడు తేలికపాటి డిటర్జెంట్ తో ఉతకవచ్చు. *కొత్తలో కొంగుని, అంచు విడిగా ఉతకడం మంచిది. *బ్రష్ తో రుద్దవద్దు. జరీ పాడైపోతుంది. సున్నితమైన పోగులు తెగిపోయి చీర డిజైన్ పాడైపోతుంది. *మరకలేమైనా పడినప్పుడు వెంటనే చల్లటి నీళ్ళతో కడిగేయాలి. *ఐరన్ చేసేటప్పుడు నార్మల్ హీట్ లో ఐరన్ చేయాలి. *మరీ మొండి మరకలు అనుకుంటే పెట్రోల్ లో ముంచిన పాత బట్టతో మరక పడిన చోట రుద్ది ఉతకాలి. *నెలకోసారి మడతలు మారుస్తుంటే మడతల్లో జరీ విరిగిపోకుండా ఉంటుంది. *చీరల్ని నేత తువ్వాలు వంటి వస్త్రం లో చుట్టి పైన కింద వేపాకు పరిచి భద్రం చేయాలి. *చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ ను ఉపయోగించాలి. *రంగులు వెలసిపోతాయని భావించే పట్టు చీరలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి. *ముఖ్యంగా పట్టుచీరలు నీడలో ఆరబెట్టాలి.

Also Read: కార్తీక్ కోసం మళ్ళీ కుట్రకు తెరలేపిన మోనిత.. పిల్లల భవిష్యత్ కోసం డాక్టర్ బాబు అనూహ్య నిర్ణయం.. Rang Panchami 2021: రంగుల పంచమితో ముగిసే హొలీ వేడుకలు.. పంచభూతాలకు గుర్తుగా జరుపుకునే పండగ..