Sheep Fashion Show: గొర్రెలకు అందాల పోటీలు.. క్యాట్‌వాక్‌తో అదరగొట్టిన గొర్రెలు.. వీడియో వైరల్
ఫ్యాషన్ షో లు మనుషులకే కాదు, జంతువులకూ నిర్వహిస్తారని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. కొన్ని దేశాల్లో జంతువుల బలనిరూపణ పోటీలతో పాటు వాటి సౌమ్యత్వాన్ని చూపే అందాల పోటీలూ...
Beauty Pageant for Sheep: ఫ్యాషన్ షో లు మనుషులకే కాదు, జంతువులకూ నిర్వహిస్తారని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. కొన్ని దేశాల్లో జంతువుల బలనిరూపణ పోటీలతో పాటు వాటి సౌమ్యత్వాన్ని చూపే అందాల పోటీలూ నిర్వహిస్తుంటారు. తాజాగా టర్కీలో గొర్రెపిల్లలకు అందాల పోటీలు నిర్వహించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ.. ఎంతో వయ్యరంగా నడుస్తూ వస్తున్న గొర్రె పిల్లలు అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాయి. మోడళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందంగా తయారైన ఈ గొర్రెలు హొయలు ఒలికిస్తూ ర్యాంప్ వాక్ చేశాయి. ఇంతకుముందు మనం కోడి పందాలు, ఎద్దుల పరుగులు, గొర్రెల కుమ్ములాటల వంటి బల నిరూపణ పోటీలు కూడా చూశాం. కానీ ఇలా జంతువులకు అందాల పోటీలు నిర్వహించడం చాలా అరుదు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అయితే, టర్కీలో గొర్రెపిల్లల అందాల పోటీలు నిర్వహించడం వెనుక ఓ కారణం ఉంది. గొర్రెల పెంపకంపై అవగాహన కల్పించేందుకు.. గొర్రెల రకాలు, వాటి మాంసం వివరాలు తెలుపుతూ ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ గొర్రెల అందాల పోటీల్లో దాదాపుగా రెండు డజన్ల గొర్రెలు వరకూ పాల్గొన్నాయి. ఒక్కో గొర్రె ఒక్కో రీతిన తయారై జ్యూరీ వారి దృష్టిని ఆకర్షించేలా వాటిని రెడీ చేశారు. ఫ్యాషన్ షోల మాదిరి గొర్రెలకు నంబర్లు ఇచ్చారు. కాగా కళ్లజోడు ధరించి.. వింత హెయిర్ స్టైల్‌తో ఉన్న గొర్రె ఫైనల్ విజేతగా నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే జంతువుల అందాల పోటీల్లా కాకుండా ఇది చాలా స్పెషల్‌గా ఉండటంతో ఈ వీడియోను నెటిజన్లు లైక్‌లు, షేర్‌లో తో నెట్టింట్లో హోరెత్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రకరకాల గొర్రెలు, గొర్రె పిల్లలు ర్యాంప్‌పైన నడుస్తుంటే ప్రేక్షకులు సంబరంగా చూస్తుండిపోయారు.
A beauty pageant for lambs: Turkey organized a catwalk for sheep to promote livestock breeding pic.twitter.com/2SFML228hH
— Reuters (@Reuters) March 31, 2021
Read Also : ఏడాదిలో 10 గ్రా. 11వేలు తగ్గిన పసిడి ధర.. ఇంకా తగ్గుతాయా..? పెరుగుతాయా..? నిపుణులు ఏమంటున్నారంటే..!