Guava Leaves: జామ ఆకులతో జుట్టు సమస్యలకు చెక్.. ఇలా ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు..
ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి.
ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. నిద్రలేమి.. మానసిక ఒత్తిడి వంటి సమస్యలతు జుట్టు రాలడం.. పలచబడడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇక వాతావరణ మార్పులు కూడా జుట్టుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి. జుట్టు సమస్యలను నియంత్రించేందుకు హెయిర్ మాస్కులు, నూనెలు, షాంపులు విరివిగా ఉపయోగిస్తుంటారు. దీంతో జుట్టు సమస్యలు అదుపులోకి రావడం కష్టం. అయితే ఇంట్లో తయారు చేసుకునే రెమెడీతో జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు. జామా కాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలాగే జామా ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ జామా ఆకులు ఎక్కువగా పనిచేస్తాయి. మరీ వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.
ముందుగా 15 నుంచి 20 జామ ఆకులను కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత కాసేపు వేళ్లతో జుట్టును మర్దన చేయాలి. అనంతరం జుట్టును గట్టిగా కట్టేయాలి. అలా 30-40 నిమిషాలు వదిలేయాలి. జుట్టు ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత షాంపూ ఉపయోగించాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
జామా ఆకులను కడిగి లీటరు నీటిలో వేసి మరిగించాలి. వాటిని 15-20 నిమిషాల వరకు ఉడకబెట్టిన తర్వాత చల్లార్చి వడగట్టి సీసాలో జాగ్రత్త పరచాలి. మీ జుట్టును షాంపూతో శుభ్రం చేసి ఆరిన తర్వాత స్ప్రే బాటిల్ సహయంతో జుట్టు మూలాలపై జామా నీటిని అప్లై చేయాలి. అనంతరం 10 నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత కొన్ని గంటలపాటు జుట్టును వదిలేయ్యాలి. ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
జామ ఆకులను కడిగి బ్లెండర్ లో వేసి చిక్కటి పేస్ట్ గా చేసుకోవాలి. అందులో చిన్న ఉల్లిపాయ వేసి పూరీలా చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఒక క్లాత్ లో వేసి రసం తీసుకోవాలి. ఉల్లిపాయ రసంలో జామా ఆకుల పేస్ట్, కొబ్బరి నూనె కలపాలి. దీన్ని తలకు పట్టించి వేళ్లతో బాగా మాసాజ్ చేయాలి. అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
Deepika padukone: ‘చూపులు గుచ్చుకోవడం అంటే ఇదేనేమో’.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వాలు కళ్ల వయ్యారి