Skin Care Tips: పుదీనాతో చర్మ సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు.. ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఎలా తయారుచేయాలంటే..
చలికాలంలో చర్మ సమస్యలు తలెత్తడం సర్వ సాధారణం. సీజన్స్ మారుతున్న కారణంగా చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి.
చలికాలంలో చర్మ సమస్యలు తలెత్తడం సర్వ సాధారణం. సీజన్స్ మారుతున్న కారణంగా చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. చలికాలంలో చర్మం పొడిబారడం.. దద్దుర్లు, బ్లాక్ హెడ్స్, మొటిమల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కెమికల్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. దీంతో కొందరికి చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సహజంగా దొరికే పుదీనా ఎంతో మేలు చేస్తుంది. పుదీనాతో చర్మంపై మచ్చలు, మొటిమలు, పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా.. బ్లాక్ హెడ్స్, టానింగ్ వంటి అనేక సమస్యలు తగ్గుతాయి.
అరటి.. పుదీనా ప్యాక్.. సగం అరటిపండు 10 నుంచి 15 పుదీనా ఆకులను మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటి పండ్లలో పొటాషియం, లాక్టిక్, ఆమైనో ఆమ్లాలు, జింక్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. మొటిమలను, మచ్చలను తగ్గించడమే కాకుండా.. కొల్లెజెన్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా.. యూవీ కిరణాల వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుందని.. చర్మాన్ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది.
పుదీనా, నిమ్మకాయ ప్యాక్.. 10 నుంచి 12 పుదీనా ఆకులను పేస్ట్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖంపై ఉండే మొటిమలు.. మచ్చలపై అప్లై చేయాలి. లేదా.. ముఖం మొత్తం అప్లై చేయవచ్చు. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. పుదీనా ఆకుల్లో సాలిసిటిక్ యాసిడ్ ఉంటుంది. మొటిమలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. నిమ్మరసం, బ్లీచింగ్ ఏజెంట్లను కలిగి ఉంటుంది. ఇది మొటిమల మచ్చలను తగ్గిస్తుంది.
ఓట్స్, దోసకాయ, పుదీనా స్క్రబ్.. ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, కొన్ని పుదీనా ఆకులు., ఒక టీస్పూన్ తేనె, రెండు టీస్పూన్ల పాలు, 1/2 అంగుళాల దోసకాయ తురుము అన్ని కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీనిని ముఖంపై 10 నిమిషాలపాటు అప్లై చేసి వేళ్లతో మసాజ్ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజు చేస్తే రెండు వారాల్లో చర్మం కాంతివంతంగా మారుతుంది.
Samantha: జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం అదే.. సమంత పోస్ట్ వైరల్..
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..