AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Homemade Cake: కేక్ అంటే ఇష్టమా.. ఇంట్లోనే ఎగ్ లెస్ వెనిలా కేక్ ని తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం

ప్రస్తుతం కేక్ తినే ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పుట్టిన రోజులు ఇలా ఎ సందర్భంలోనైనా తమ సంతోషాన్ని కేక్ కట్ చేసి వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్ లో రకరకాల కేక్ లు అందుబాటులోకి వచ్చాయి. ఎగ్ తో చేసిన కేక్ లు మాత్రమే కాదు.. ఎగ్ లేకుండా కూడా కేక్ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే బేకరీలలో దొరికే కేక్ లలో కొన్ని రకాల పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి కావని పిల్లలు ఎంతగా అడిగినా ఇవ్వడానికి కేక్ ను కొనివ్వడానికి ఇష్టపడరు. ఈ నేపధ్యంలో ఈ రోజు కోడి గుడ్డు లేకుండా వెనిలా కేక్ తయారీ గురించి తెలుసుకుందాం..

Homemade Cake: కేక్ అంటే ఇష్టమా.. ఇంట్లోనే ఎగ్ లెస్ వెనిలా కేక్ ని తయారు చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం
Eggless Vanilla Cake
Surya Kala
|

Updated on: Jan 09, 2025 | 5:56 PM

Share

కేక్ ల్లో చాలా రకాలున్నాయి. అయితే వీటిల్లో వెనిలా కేక్ పిల్లలు, పెద్దలు ఇష్టపడే క్లాసిక్ కేక్. ఈ కేక్ తయారు చేయడానికి రకరకాలు పద్ధతులున్నాయి. కొంత మంది గుడ్డుని ఉపయోగించి కేక్ ను తయారు చేస్తారు. దీనిని ఇష్టంగా తింటారు కూడా.. అయితే మరికొందరికి కేక్ అంటే ఇష్టం ఉన్నా.. గుడ్డు ఉంది అని తినరు. అలాంటి వారి కోసం ఎగ్ లెస్ కేక్ ని తయారు చేసి ఇవ్వవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా సింపుల్ పద్దతిలో ఎటువంటి కష్టం లేకుండా ఎగ్‌లెస్ కేక్‌ను తయారు చేయవచ్చు. ఈ రోజు వెనిలా ఎగ్‌లెస్ కేక్‌ తయారీ విధానం తెలుసుకుందాం..

వెనిలా ఎగ్‌లెస్ కేక్‌ తయారీకి కావాల్సిన పదార్ధాలు..

  1. వంట నూనె- 40 గ్రాముల
  2. మైదా- 85 గ్రా
  3. చక్కెర- 55 గ్రాముల పొడి
  4. పాలు- 90 ml
  5. పాల పొడి- 1 1/2 స్పూన్
  6. వెనిగర్- 1/2 స్పూన్
  7. వెనిలా ఎసెన్స్- 1/2 టీస్పూన్
  8. కార్న్‌ఫ్లోర్- 2 1/4 స్పూన్
  9. బేకింగ్ పౌడర్- 1/2 + 1/8 టీస్పూన్
  10. బేకింగ్ సోడా- 1/8 టీస్పూన్
  11. ఉప్పు- 1/8 స్పూన్

తయారీ విధానం: ముందుగా పాలను తీసుకుకుని అందులో వెనిగర్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టండి. మరొక గిన్నె తీసుకుని ఇప్పుడు నూనె, షుగర్ పౌడర్ ని తీసుకుని.. కొంచెం సేపు మిక్స్ చేసి.. అందులో వెనిగర్ పాలు మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. పాలుగా అయ్యే వరకూ మిశ్రమాన్ని కలిపి అప్పుడు అందులో తీసుకున్న పదార్ధాలను అంటే.. వెనిలా ఎసెన్స్, మైదా, పాల పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, కార్న్‌ఫ్లోర్ జోడించండి. ఇప్పుడు ఈ పిండి మృదువుగా అయ్యేంత వరకూ బాగా కలపండి. ఇప్పుడు ఒక దళసరి గిన్నె తీసుకుని లోపల అంచులకు కొంచెం నూనె రాసి.. బటర్ పేపర్ వేసి అప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి సరి చేసి.. ఓవెన్ లో పెట్టి.. 160 డిగ్రీల వద్ద 25-30 నిమిషాలు పాటు బేక్ చేయండి.

ఒకవేళ ఓవెన్ లేకపోతే కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఇసుక పోసి.. అప్పుడు ఒక గిన్నె పెట్టి దాని మీద కేక్ మిశ్రమం వేసుకున్న గిన్నెను పెట్టండి. కేక్ ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక టూత్ పిక్ ని గుచ్చి చూడండి.. పుల్లకు ఎటువంటి పిండి అంటుకోక పొతే కేక్ ఉడికినట్లు. అంతే టేస్టీ టేస్టీ వెనిలా ఎగ్‌లెస్ కేక్‌ రెడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?
ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?