Shopping Tips: మహిళలు లెదర్ హ్యాండ్ బ్యాగ్ కొంటున్నారా ? అసలైన బ్రాండ్.. ఫేక్ బ్రాండ్ మధ్య తేడాలు తెలుసుకోండిలా..
Shopping Tips : మహిళలకు ముఖ్యమైన వస్తువులలో హ్యాండ్ బ్యాగ్ ఒకటి. మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్స్ కలిగిన బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి.
Shopping Tips : మహిళలకు ముఖ్యమైన వస్తువులలో హ్యాండ్ బ్యాగ్ ఒకటి. మార్కెట్లో ఎన్నో రకాల బ్రాండ్స్ కలిగిన బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బ్యాగ్స్ కొద్ది రోజులకే పాడవుతుంటాయి. ప్రస్తుతం లెదర్ బ్యాగ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అయితే కేవలం మెరుగులు కాకుండా.. ఎక్కువగా కాలం పనిచేసే లెదర్ బ్యాగ్స్ ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
బ్యాగ్ కలర్.. మీరు బ్యాగ్ తీసుకునే ముందు వాటిని కాస్తా రుద్ది పరీక్షించాలి. ఇలా చేసినప్పుడు రంగు మారడం.. మచ్చలు మచ్చలుగా కలర్ వెలసిపోవడం జరుగుతుంది.. అంతేకాదు.. నిజమైన లెదర్ బ్యాగ్ అయితే అది కాస్తా వంగుతుంది. ఫేక్ అలా ఉండదు. ఒకవేళ వంచితే.. బ్యాగ్ పగిలినట్టుగా కనిపిస్తుంది.
వాసన ద్వారా.. నిజమైన స్కీన్ బ్యాగ్ ఒక వింత వాసన వస్తుంది. నకిలీ బ్యాగ్ మాత్రం ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది.
మెరుపులు.. లెదర్ బ్యాగ్స్ చాలా షైనీగా కనిపిస్తుంటాయి. కానీ నిజమైన లెదర్ బ్యాగ్స్ షైనీగా ఉండవు. అంతేకాకుండా నిజమైన గరుకుగా గట్టిగా ఉంటాయి. నకిలీవి షైనీగా ఉండడమే కాకుండా.. సాఫ్ట్ గా ఉంటాయి.
లెదర్ ఫినిషింగ్.. నిజమైన లెదర్ బ్యాగులు జంతువుల చర్మం నుంచి తయారు చేస్తారు. ఇవి చాలా ఖరీదైనవి. వీటిని రెడీ చేయాడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. మార్కెట్లో సులభంగా లభిస్తుంది.