British military documents: బజారుపాలైన బ్రిటన్ కీలక పత్రాలు.. బస్టాప్ పక్కన చెత్తలో రక్షణ శాఖ రహాస్యాల చిట్టా !

బ్రిటన్‌ రక్షణ శాఖకు చెందిన కీలక, రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. గత మంగళవారం కెంట్‌ కౌంటీలోని ఓ బస్టాప్‌ వద్ద ఇవీ ఓ వ్యక్తి కంటబడ్డాయి.

British military documents: బజారుపాలైన బ్రిటన్ కీలక పత్రాలు.. బస్టాప్ పక్కన చెత్తలో రక్షణ శాఖ రహాస్యాల చిట్టా !
Top Secret British Military Documents
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2021 | 8:46 PM

British military documents at a bus stop: బ్రిటన్‌ రక్షణ శాఖకు చెందిన కీలక, రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. గత మంగళవారం కెంట్‌ కౌంటీలోని ఓ బస్టాప్‌ వద్ద ఇవీ ఓ వ్యక్తి కంటబడ్డాయి. బ్రిటిష్‌ మిలటరీ, యుద్ధనౌకలకు సంబంధించిన సమాచారం ఆ పత్రాల్లో ఉందని ఆదివారం బీబీసీ మీడియా వెల్లడించింది. రక్షణ శాఖ సీనియర్‌ అధికారుల ఈమెయిల్స్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు కూడా వాటిలో ఉన్నట్లు పేర్కొంది. ఇలాంటి రహాస్య పత్రాలు రోడ్డు పక్కన బస్టాప్ వద్ద ఉన్న చెత్తకుప్పలో దొరకడం తీవ్ర సంచలన కలిగిస్తోంది.

ఇదిలావుంటే, రక్షణ శాఖ కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు మాయమైనట్టు గత వారం ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేసి ఉండటంతో.. అవే ఇవని భావిస్తున్నారు. బ్రిటన్‌ యుద్ధనౌక ‘హెచ్‌ఎంఎస్‌ డిఫెండర్‌’ను క్రిమియా సముద్ర జలాల్లోంచి వెళ్లేలా చేస్తే.. రష్యా స్పందన ఎలా ఉంటుందోనన్న చర్చ ఆ పత్రాల్లో ఉంది. ఒకవేళ రష్యా దూకుడుగా స్పందిస్తే దీటుగా ఎదుర్కొనేలా అవసరమైన తుపాకులు, హెలికాప్టర్‌ను యుద్ధనౌకలోని హ్యాంగర్‌లో సిద్ధంగా ఉంచినట్టు అందులో పేర్కొనట్లు సమాచారం.

కాగా క్రిమియా జలాల్లోకి బుధవారం బ్రిటన్‌ యుద్ధనౌక వచ్చిందని, దాన్ని తమ తీరరక్షక విమానాలు, నౌకలు వెంబడించి కాల్పులు జరిపినట్టు రష్యా ఇప్పటికే వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌ నుంచి ఈ ఏడాది అమెరికా ఆధ్వర్యంలోని నాటో దళాల ఉపసంహరణ పూర్తయ్యాక అక్కడ బ్రిటన్‌ సైనిక ఉనికికి సంబంధించిన ప్రణాళికలు సైతం ఈ పత్రాల్లో ఉన్నాయి. అయితే, ఎట్టకేలకు ఈ పత్రాలు దొరకడం పట్ల అధికారుల అప్రమత్తమయ్యారు. డాక్యుమెంట్స్ బజారు కావడంపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Read Also… Tesla Cars Recall: దాదాపు 3లక్షల కార్లను వెనక్కి రప్పించిన టెస్లా కంపెనీ.. ఆ దేశంలో తయారైన వాటిని మాత్రమే!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ