Corona Vaccine Cures Paralysis : కరోనా టీకా తీసుకుంటే పక్షవాతం నయమవుతుందా..! మద్యప్రదేశ్‌లో ఇదే జరిగింది..
Corona Vaccine Cures Paralysis : కరోనా వైరస్‌ని ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్తంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది.
Corona Vaccine Cures Paralysis : కరోనా వైరస్‌ని ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్తంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అయితే ఇంకా కొంతమంది టీకా వేసుకుంటే ఏదో జరిగిపోతుందనే భ్రమలో ఉన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లోఒక కేసు తెరపైకి వచ్చింది. టీకా తీసుకున్న ఓ వ్యక్తికి సంబంధించి తీవ్రమైన అనారోగ్యం నయమైంది. ఆ వ్యక్తి గత కొన్ని నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.. చికిత్స చేసినప్పటికీ ఫలితం లేదు. కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక అతడి వ్యాధి నయమైంది.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా నివాసి అబ్దుల్ మజీద్ ఖాన్ గత ఏడు నెలలుగా పక్షవాతంతో పోరాడుతున్నాడు. దాని ప్రభావం అతడి నోటిపై కూడా ఉంది. ఈ కారణంగా అతను సరిగ్గా మాట్లాడలేకపోయాడు. చాలా చోట్ల చికిత్స చేసినప్పటికీ అతనికి ఎటువంటి ప్రయోజనం లభించలేదు. కానీ కరోనా వ్యాక్సిన్ అతనికి ఒక వరమని నిరూపించింది. మాజిద్ ఖాన్‌కు కోవిడ్‌షీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు.
అరగంటలో పక్షవాతం నయమైంది.. మజీద్ ఖాన్ టీకా పొందిన అరగంటలో తన వ్యాధి నయమైందని చెప్పాడు. టీకాలు వేసిన కొద్దిసేపటికే స్తంభించిన అవయవాలలో కదలికలు ప్రారంభమయ్యాయని అన్నాడు. టీకా వేసుకున్న తరువాత పక్షవాతం నుంచి 75 శాతం ఉపశమనం లభించిందని పేర్కొన్నాడు. పక్షవాతం కారణంగా మాట్లాడటంలో తనకు ఇబ్బంది ఉండేదని కానీ ఇప్పుడు సరిగ్గా మాట్లాడుతున్నానని తెలిపాడు. అప్పటి నుంచి వ్యాక్సిన్ వేసుకోవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు.