Anantapur : అక్రమ బంధానికి అడ్డొస్తున్నాడని సొంత కొడుకుని ఆ తల్లి ఏం చేసిందంటే..!

అనంతపురం కదిరి నియోజకవర్గంలో దారుణ ఘటన జరిగింది. సొంత కొడుకుని హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చింది ఒక తల్లి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

Anantapur : అక్రమ బంధానికి అడ్డొస్తున్నాడని సొంత కొడుకుని ఆ తల్లి ఏం చేసిందంటే..!
Son Murder
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 28, 2021 | 8:16 PM

Illigal Relation : అనంతపురం కదిరి నియోజకవర్గంలో దారుణ ఘటన జరిగింది. సొంత కొడుకుని హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చింది ఒక తల్లి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్నా అనే యువకుడ్ని హత్య చేయించింది సొంత తల్లి సుబ్బలక్ష్మి. నల్ల చెరువు సమీపంలో వారం రోజుల క్రితం ఈ ఘోరం జరిగింది. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఒకటిన్నర లక్ష రూపాయలకు ఒప్పందం చేసుకుని సొంత కొడుకునే హత్య చేయించినట్టు పోలీస్ విచారణలో బయటపడింది.

హత్య కు పాల్పడ్డ నలుగురు నిందితులతో పాటు తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నాటు తుపాకీ, ఐదు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం, మద్యం, పురుగుల మందు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలేవాండ్ల పల్లి సమీపంలోని ఆవుల చెరువు వద్ద వారం కిందట గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన ఘటన బయటపడింది. మరుసటి రోజు మృతుడి భార్య పవిత్ర, అమ్మ సుబ్బలక్ష్మి లు పోలీసుల వద్దకు వెళ్లారు. విచారణలో అతని అమ్మ పై అనుమానం వచ్చి లోతైన దర్యాప్తు చేసి, మృతిని ఫోన్ కాల్స్ ఆధారంగా ఆదినారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

అనంతరం కదిరి మండలంలోని సున్నపుగుట్ట తాండా గ్రామ శివార్లలో మరో ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మృతుడు కదిరి పట్టణంలో నివాసముంటున్న బాల చిన్న. అయితే మృతుడి తల్లి సుబ్బలక్ష్మి అక్రమ సంబంధం పలువురితో ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలోనే తల్లి కొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తన కొడుకు బతికే ఉంటే తన వ్యవహారాలకు అడ్డుగా ఉన్నాడని భావించి శ్రీనివాసులు అనే వ్యక్తి సహాయంతో హత్య చేయించినట్లు పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది.

Read also : YCP MP : ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి