AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pretty Hair Color Ideas : ఫ్యాషన్ ప్రపంచంలో యూత్ ఐకాన్ గా మారాలంటే.. మీ జట్టుకు రంగు ఎలా ఎంచుకోవాలంటే..

టి తరం యువతికి రోజు కో రకంగా అందంగా ఉండడం అంటే ఇష్టం.. జుట్టు దగ్గర నుంచి ధరించే దుస్తుల వరకూ అన్నీ డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ తెల్ల జుట్టు వచ్చిన వారు మాత్రమే కలర్స్ వేసుకునేవారు....

Pretty Hair Color Ideas : ఫ్యాషన్ ప్రపంచంలో యూత్ ఐకాన్ గా మారాలంటే.. మీ జట్టుకు రంగు ఎలా ఎంచుకోవాలంటే..
Surya Kala
|

Updated on: Mar 02, 2021 | 4:31 PM

Share

Pretty Hair Color Ideas : నేటి తరం యువతికి రోజు కో రకంగా అందంగా ఉండడం అంటే ఇష్టం.. జుట్టు దగ్గర నుంచి ధరించే దుస్తుల వరకూ అన్నీ డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ తెల్ల జుట్టు వచ్చిన వారు మాత్రమే కలర్స్ వేసుకునేవారు.. రోజు రోజుకీ కాలం మారుతుంది.. దీంతో పాటే.. యువత ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఇక నల్లటి జుట్టును రకరకాల రంగులతో నింపేస్తున్నారు. డిఫరెంట్ లుక్ తో యూత్ ఐకాన్స్ గా ఆకర్షిస్తున్నారు.

ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో బ్రైట్ హెయిర్ కలర్ అనేది సార్వాసాధారంగా మారింది. అమ్మాయిలు తమ జుట్టుని రకరకాల రంగులతో నింపేస్తున్నారు. అయితే వీరు ఎటువంటి రంగు ని ఎంచుకోవాలి.. ఇప్పుడు తెలుసుకుందాం..!

జుట్టు కు ఎంచుకునే రంగు :

తమ సహజమైన జుట్టు రంగును మార్చుకోవాలనుకునే యువత ప్రొఫెషనల్ బ్యూటీషియన్ ను సంప్రదించడం మంచిది. వారు మీకు జుట్టుకు సరిపోయే పెయింట్ మరియు రంగు ను చెబుతాడు.

HAIR-COLOUR-1

ఈ వేసవిలో కొత్త రంగులను ప్రయత్నించండి!

జుట్టుకు వేసుకునే రంగును ఎంచుకునే ముందు మీ చర్మం రంగుపై దృష్టి పెట్టడం తప్పని సరి. చర్మం , కళ్ళ రంగుకు అనుగుణంగా జుట్టుకు ఎంచుకునే రంగు ఉంటె మరింత అందంగా కనిపిస్తారు. ఒక వేళ మీరు ప్రొఫెషనల్స్ ను సంప్రదించకుండా కలర్ వేసుకోవాలను కుంటే అప్పుడు ఓ రెండు మూడు గంటలకు పోయే హెయిర్ కలర్ ను ఎంచుకోండి.

మీ శైలి, వృత్తికి తగిన రంగును ఎంచుకోండి HAIR-COLOUR-2

మీరు స్వసతహాగా అందగత్తె అయినా మీరు మరింత అందంగా కనిపించేలా జుట్టు రంగును ఎంచుకోవచ్చు. అంతేకాదు మీ వృత్తి పరంగా కూడా జుట్టు రంగు ఎంచుకోవాలి ఉంటుంది.

కలర్ హెయిర్ డైయింగ్ జుట్టుకు చాలా హానికరం అని చాలా మంది భావిస్తారు. అయితే వాస్తవానికి, దీనిని జుట్టుకు వైద్యం చేసే విధానం అని కొందరు అంటారు. ఎందుకంటే ప్రస్తుతం యువత వేసుకుంటున్న రంగులు వారి జుట్టును ఆరోగ్యంగా ఉండేలా రూపొందించబడ్డాయి. ఈ జుట్టు రంగు వేయడంతో అమ్మాయి అందంగా కనిపించేలా చెయ్యడమే కాదు.. సురక్షితంగా ఉండేలా శాస్త్రీయ సంస్థలు పనిచేస్తున్నాయి

Also Read:

ఫేక్ పాస్‌పోర్ట్ వ్యవహారంలో కుదులుతున్న డొంక.. రీ వెరిఫై చేస్తున్న పోలీస్ అధికారులు

మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021 ప్రారంభించిన ప్రధాని మోదీ.. నౌకాశ్రయాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం జగన్‌