AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Eating Mistake: గుడ్డు తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అసలుకే ఎసరు..! బీకేర్‌ ఫుల్

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో గుడ్డు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే కొందరు తెలిసో.. తెలియకో..వీటిని సరైన విధానంలో తినరు. దీంతో గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనం అటుంచితే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో.. అసలు గుడ్డు ఏ సమయంలో తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

Egg Eating Mistake: గుడ్డు తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అసలుకే ఎసరు..! బీకేర్‌ ఫుల్
చాలా మంది అభిప్రాయం ప్రకారం, గోధుమ రంగు గుడ్లు మరింత పోషకమైనవి. ఎందుకంటే అవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది అంటుంటారు. నిజానికి.. గుడ్డు రంగు కోడి జాతి, జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తెల్ల రెక్కలున్న కోళ్ల గుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు రంగు ఈకలు కలిగిన కోడి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు తెల్ల కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడతాయి. గుడ్డు పెంకు యొక్క గోధుమ రంగు ప్రధానంగా కోడి గర్భాశయంలోని కణ గ్రంధుల కారణంగా ఉంటుంది.
Srilakshmi C
|

Updated on: Dec 27, 2024 | 1:01 PM

Share

గుడ్డు సూపర్ ఫుడ్స్ జాబితాకి చెందింది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, ఖనిజాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి12 లోపం ఉన్నవారు దీనిని రోజూ తినాలి. గుడ్లు తినడం వల్ల బలహీనత తగ్గి బలం పెరుగుతుంది. మధ్యస్థ పరిమాణంలో ఉండే గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులోని తక్కువ కేలరీల ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జిమ్‌కు వెళ్లేవారు గుడ్డు తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. దీని వినియోగం ఫోలేట్, విటమిన్ A, విటమిన్ B5, B12, ఫాస్పరస్, సెలీనియంలను కూడా అందిస్తుంది. అయితే గుడ్లు తినేటప్పుడు కొందరు కొన్ని విధాలైన తప్పులు చేస్తుంటారు. దీని వల్ల మనకు గుడ్డులోని పూర్తి ప్రోటీన్ అందదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. గుడ్లు తినేటప్పుడు చేసే తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

పచ్చి గుడ్డు వద్దు

పచ్చి గుడ్లను అస్సలు తినకూడదు. ఇందులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది సాల్మొనెల్లా సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కూడా కారణం కావచ్చు. పచ్చి గుడ్లలో అవిడిన్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బయోటిన్‌తో బంధిస్తుంది. దీని కారణంగా బయోటిన్ లోపం ఏర్పడుతుంది. జుట్టు ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా ముఖ్యం. దీని లోపం వల్ల జుట్టు సమస్యలకు దారితీస్తుంది. 1998 నాటి వైద్య అధ్యయనం ప్రకారం శరీరానికి 90 శాతం ప్రొటీన్లు బాగా ఉడికించిన గుడ్డు నుంచే లభిస్తాయి. కానీ పచ్చి గుడ్డు నుండి శాతం 50 శాతం ప్రొటీన్లు మాత్రమే అందుతాయి. మిగిలిన ప్రోటీన్ వృధా అవుతుంది.

గుడ్లు తినడానికి ఉత్తమ మార్గం ఏమిటి?

ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల, ప్రమాదకరమైన బ్యాక్టీరియా సాల్మొనెల్లా, యాంటీ న్యూట్రియంట్ అవిడిన్ నాశనం అవుతాయి. అదనంగా, ప్రోటీన్ కూడా అందుతుంది. కాబట్టి గుడ్డు ఎల్లప్పుడూ ఉడికించి తినాలి.

ఇవి కూడా చదవండి

గుడ్లు తినడానికి ఉత్తమ సమయం ఏది?

రెండు సమయాల్లో గుడ్లు తినవచ్చు. ఉదయం, రాత్రి గుడ్లు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే రాత్రిపూట గుడ్లు తినడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. ఇది చాలా కాలం పాటు ఆకలితో ఉండకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాత్రిపూట గుడ్లు తింటే శరీరానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మన కండరాలు కోలుకుంటాయి. బరువు పెరగాలనుకునే వారికి రాత్రిపూట గుడ్లు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ రాత్రిపూట 2 నుండి 3 గుడ్లు తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.