బాబోయ్ బొద్దింకల బెడద భరించలేకపోతున్నారా..? ఇవి మూడు నీటిలో కలిపి చల్లితే దెబ్బకు పరార్..
అయితే, ఇక్కడ ముక్యమైన విషయం ఏంటంటే.. బొద్దింకలు ఎక్కువగా వాడని, తేమ అధికంగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కప్‌బోర్డులు, కిచెన్ సింక్ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైనా హోల్స్, క్రాక్స్, పగిలిన పైప్స్ ఉంటే ముందుగా వాటిని సీల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం చాలామంది ఇళ్లలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా కొందరి ఇళ్లలో బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. మరికొందరి ఇళ్లల్లో నైట్ లైట్స్ ఆఫ్ చేశాక బొద్దింకలు ఇల్లంతా సంచారం చేస్తుంటాయి. బొద్దింకలు ఉండడం సర్వసాధారణమైనప్పటికీ ఆహార పదార్థాలపై కూడా తిరుగుతున్నాయి. దీనివల్ల అనేక జబ్బులు బారిన పడుతున్నారు. ఇక బొద్దింకలు చిన్న చిన్న పిల్లలను పెట్టి వాటి సామ్రాజ్యాన్ని వ్యాప్తి చెందేలా చేతున్నాయి. బొద్దింకలు ఇంట్లో ఎక్కువ అవ్వడం వల్ల కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అయితే, ఇంట్లోంచి బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతుంటారు. సులభంగా బొద్దింకల నుంచి విముక్తి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బొద్దింకల నుంచి విముక్తి పొందడానికి ప్రతిరోజు ఇంట్లో బోరాక్స్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార మూడింటిని బకెట్ నీళ్లలో కలిపి పిచికారి చేయండి. వారంలో ఇలా నాలుగు రోజులపాటు పిచికారి చేస్తే, బొద్దింకల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఇది పిచికారి చేయడం వల్ల కూడా దోమలు రాకుండా ఉంటాయి. అలాగే బల్లులు కూడా తగ్గుతాయి.
అయితే, ఇక్కడ ముక్యమైన విషయం ఏంటంటే.. బొద్దింకలు ఎక్కువగా వాడని, తేమ అధికంగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. కప్‌బోర్డులు, కిచెన్ సింక్ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడైనా హోల్స్, క్రాక్స్, పగిలిన పైప్స్ ఉంటే ముందుగా వాటిని సీల్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..