AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Garlic in Summer: వేసవిలో వీరు వెల్లుల్లి తిన్నారంటే బండి షెడ్డుకే.. మర్చిపోయి కూడా ముట్టుకోకూడదు

చాలా మందికి వెల్లుల్లి అంటే మహాఇష్టం. కొంతమందికైతే దాని వాసన కూడా నచ్చదు. ఇష్టాయిష్టాల సంగతి పక్కనపెడితే.. వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే అల్లిసిన్ అనే మూలకం శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అంతేకాకుండా అజీర్ణం, జలుబు వంటి వాటికి కూడా బలేగా పని చేస్తుంది. కానీ వేసవిలో మాత్రం..

Raw Garlic in Summer: వేసవిలో వీరు వెల్లుల్లి తిన్నారంటే బండి షెడ్డుకే.. మర్చిపోయి కూడా ముట్టుకోకూడదు
Raw Garlic In Summer
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2025 | 12:16 PM

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ వేసవిలో వీటిని తినవచ్చా లేదా? అనే విషయంలో చాలా మందికి అయోమయం ఉంటుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో వీటిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వెల్లుల్లి శరీరంలో సహజంగా వేడిని పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది శరీరంలో వేడిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో వాతావరణం ఇప్పటికే వేడిగా ఉన్నందున వీటిని అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. దీని వల్ల మన శరీర వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వేసవిలో వెల్లుల్లిని ఎవరు తినకూడదో? ఆ వివరాలు మీ కోసం..

వెల్లుల్లి ఎవరికి మంచిది కాదు?

నోటి పూతల, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు వేసవిలో పచ్చి వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా తినవలసి వస్తే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినడం మంచిది.

ఎవరు తినవచ్చు?

వెల్లుల్లిలోని ఆరోగ్యకరమైన లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు వంటి కాలానుగుణ వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వాటిని పచ్చిగా తినడానికి బదులుగా, ఉడికించి కూరగాయలతో కలిపి తినవచ్చు. కానీ రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బల కంటే ఎక్కువ తినకండి. పచ్చి వెల్లుల్లి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. కానీ దీన్ని అతిగా తినకూడదు. జీర్ణ సమస్యలు ఉన్నవారు వేసవిలో వెల్లుల్లిని మితంగా తీసుకోవచ్చు. ఇది కడుపు మంట, గ్యాస్ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.