Kitchen Hacks: ఈ సింపుల్ చిట్కాలతో కిచెన్‌లో ఈగలకు చెక్ పెట్టండిలా..!
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కిచెన్‌ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. కానీ వంట చేసేటప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈగలు, సన్నదోమలు ఎక్కువగా వస్తాయి. అవి ఆహారంపై వాలడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను నివారించేందుకు కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా కొన్ని సింపుల్ చిట్కాలను మీకోసం తీసుకొచ్చాను. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలా మంది మార్కెట్‌లో లభించే కెమికల్ లిక్విడ్స్‌ను వాడి ఈగలు, దోమల సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. అవి తక్షణ ఉపశమనం కలిగించవచ్చేమోగానీ ఆరోగ్యానికి మాత్రం హానికరం. అందుకే ఇంట్లో లభించే సహజమైన వస్తువులను ఉపయోగించడం ఉత్తమం. ఈగలను తరిమికొట్టేందుకు సహజమైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఈగలను నివారించేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది. పండ్లు తెచ్చినప్పుడు వాటిపై చిన్న ఈగలు ఎక్కువగా వాలుతుంటాయి. అప్పుడు ఈ వెనిగర్‌తో పాటు డిష్ సోప్‌ను ఉపయోగిస్తే ఈగలను సమర్థవంతంగా తరిమికొట్టవచ్చు.
- ఒక చిన్న గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి.
- అందులో కొన్ని చుక్కల డిష్ సోప్ కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచాలి.
- ఈ వాసన వల్ల ఈగలు అక్కడికి రాకుండా ఉంటాయి.
నిమ్మకాయ, లవంగం
ఇది రసాయనాలు లేకుండా ఈగలను తరిమికొట్టే బలమైన మార్గం. అంతేకాకుండా కిచెన్‌లో సువాసనను ఇచ్చే నేచురల్ రెమెడీ కూడా.
- ఒక తాజా నిమ్మకాయను సగానికి కట్ చేయాలి.
- కట్ చేసిన భాగంలో లవంగాలను అమర్చాలి.
- ఈ మిశ్రమాన్ని వంటగది మూలల్లో లేదా ఈగలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచాలి.
- ఇది కిచెన్‌కు మంచి వాసననిచ్చేలా చేస్తూ ఈగలను దూరంగా ఉంచుతుంది.
తులసి, పుదీనా మొక్కలు
కొన్ని మొక్కల వాసన ఈగలకు నచ్చదు. అవి సహజసిద్ధంగా ఈగలను కిచెన్‌కు దగ్గరయ్యేలా అనుమతించవు.
- కిచెన్‌లో తులసి లేదా పుదీనా మొక్కలను పెంచండి.
- కిటికీల దగ్గర లేదా తలుపుల వద్ద చిన్న కుండీలలో ఉంచాలి.
- ఈ మొక్కల మృదువైన, సహజమైన వాసన వల్ల ఈగలు కిచెన్‌లోకి రాకుండా ఉంటాయి.




