AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warren Buffett: నో చెప్పడం నేర్చుకో.. అప్పుడే జీవితం మొదలవుతుంది.. వారెన్ బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాలు

వారెన్ బఫెట్.. కోక్, ఐస్క్రీం, పాస్ట్ ఫుడ్ బిజినెస్ లతో మొదలుపెట్టి ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 94 ఏళ్లు. అతను ఆర్థిక రంగంలో అత్యంత చురుకైన వారిలో ఒకడు. ఈ వయసులోనూ ఆర్థిక రంగంలో అత్యంత చురుకైన వ్యక్తుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. మరి దీని వెనక అతడి సీక్రెట్ ఏంటో తెలుసా. వారెన్ బఫెట్ జీవితం నుంచి కచ్చితంగా నేర్చుకోవాల్సిన 5 అలవాట్లు ఇవి..

Warren Buffett: నో చెప్పడం నేర్చుకో.. అప్పుడే జీవితం మొదలవుతుంది.. వారెన్ బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాలు
Warren Buffett Secret For Succes
Bhavani
|

Updated on: Mar 02, 2025 | 5:28 PM

Share

వయసు 94.. సంపద సుమారు రూ. 86 లక్షల కోట్లు. ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పరిచయం అక్కరలేని పేరు. కోక్, ఐస్ క్రీంలు వంటివి అమ్ముతూ తన జీవితాన్ని మొదలు పెట్టిన వారెన్ ఇప్పుడు ఏకంగా ట్రిలియన్ కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. బెర్క్ షైర్ హత్ వే వంటి కంపెనీలను స్థాపించి నెంబర్ వన్ స్థానానికి అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు. చిన్ననాటి నుంచే పెట్టుబడులపై ఇష్టం పెంచుకున్న ఇతడు అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. దీనికి ప్రధాన కారణం వారెన్ బఫెట్ వ్యాపార సూత్రాలే కాదు అతడి మెంటల్ స్టామినా కూడా. తన బుర్రను ఉపయోగించి స్టాక్ మార్కెట్లలో లాభాలు రాబట్టడం ఎలాగో తెలుసుకున్నాడు. ఈ వయసులోనూ అంతే పదునుగా ఆలోచించగలడు. దీనికి కారణం తన అలవాట్లే అంటాడు. మరి ఆయనలా మీరు కూడా బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. ఆయన చెప్పిన 5 బ్రెయిన్ టెక్నిక్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.

బిలియనీర్ లాగా నిద్రపోండి..

చాలా మంది సీఈవోలు ఉదయం 4 గంటలకే నిద్రలేవడం గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. కానీ వారెన్ బఫెట్ మాత్రం రోజుకి కచ్చితంగా 8 గంటలు నిద్రపోతాడట. నాకు ఉదయం నాలుగు గంటలకే లేచి పనికి వెళ్లిపోవాలనే కోరికేం ఉండదు. అని అతడు 2017లో ఒక సందర్భంలో చెప్పాడు. సైన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది. మంచి నిద్ర దీర్ఘాయుష్షును పెంచుతుంది.

బిట్ కాయిన్ కాదు బ్రిడ్జ్ అంటే ఇష్టమట..

ట్రిలియన్ డాలర్ల కంపెనీలను నిర్వహించే ఈ బిలియనీర్ ఇప్పటికీ బుర్రకు పదును పెట్టే ఆటలంటే తెగ ఇష్టపడతాడట. అందరిలా బిట్ కాయిన్లు గట్రా అంటూ ఎంతసేపు బిజినెస్ మీద మనసు పెట్టకుండా బ్రిడ్జ్ లాంటి ఆటలు ఆడటం తనకెంతో ఇష్టమని ఇది మెదడుకు మంచి వ్యాయామమని వారెన్ తెలిపాడు.

ఔనని అంటాడా.. కాదంటాడా..

మన మొహమాటమే మన శత్రువంటాడు ఈ బిజినెస్ మ్యాన్. తాను రోజూ ఎన్నో సమావేశాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. అయితే, తకు వెళ్లడం ఇష్టం లేకపోతే మాత్రం నో చెప్పేందుకు వెనకాడడట. తనకు సమావేశాల కంటే కూడా ఖాళీగా దొరికే కాస్త సమయమే ఎక్కువ విలువైందని చెప్తాడు. బిల్ గేట్స్ కూడా వారెన్ బఫెట్ విధానాన్ని సమర్థిస్తాడు.

బిజినెస్ రహస్యం అదే..

వారెన్ బఫెట్ తన సమయాన్ని ఎక్కువ శాతం పుస్తకాలు చదివేందుకే ఇష్టపడతాడట. తన రోజులో కనీసం 6 గంటలు రీడింగ్ కోసం కేటాయిస్తానని అతడు చెప్పిన మాటలు నిజంగానే ఆశ్చర్యపరుస్తాయి. అలాగే నిరంతరం వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం తనను సంతోషంగా ఉంచుతుందని బికమింగ్ వారెన్ బఫెట్ పుస్తకంలో రాసుకొచ్చాడు. క్రమం తప్పకుండా పుస్తకాలు చదివే అలవాటే తననెప్పుడూ మానసికంగా చురుగ్గా ఉంచుతుందని తెలిపాడు. ఇది మెదడుకు పదును పెట్టి ఆలోచనల్లో మరింత క్లారిటీనిస్తుందని పరిశోధకులు కూడా చెప్తున్నారు.

ఇలాగే తినాలంటాడు..

మనకు జీవితం ఎన్నో ఇచ్చింది. మన మీద ఆధారపడి ఉన్న కుటుంబం, ఉద్యోగులు, మన కోసం పనిచేస్తున్నవారు ఇలా ఎంతో మందిని నడిపించాల్సిన అవసరం ఉంటుంది. ఇంత చక్కటి జీవితాన్ని ఏది పడితే అది తిని నాశనం చేసుకోవడం సరికాదని బఫెట్ నమ్ముతాడు. సమతులాహారం తీసుకోవడంలోనే అంతా ఉందంటాడు.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్