RBI: ఆర్బీఐ మరో బిగ్ డెసిషన్.. బ్యాంక్ కస్టమర్లకు భారీ ఊరట.. ఇక నుంచి మరింత వేగంగా..
బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులు వీటిని పాటించాలని ఆదేశించింది. అమలపై ఆర్బీఐ ఎప్పటికప్పడు సమీక్ష చేపట్టనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల కస్టమర్లకు ఉపయోగపడేలా ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్యాంకుల కస్టమర్లకు ఏదైనా సమస్య ఉన్నా లేదా ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా మరింత సులువు అవుతుంది. ఇప్పటివరకు బ్యాంకులకు సంబంధించి కస్టమర్లు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌కు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక నుంచి ఆ సమస్య ఉండదు. ఇకపై ప్రతీ బ్యాంకులో అంబుడ్స్‌మెన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల బ్యాంకు కస్టమర్లు తమ సమస్యలు, ఫిర్యాదులను అందించవచ్చు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ తాజాగా కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
దేశంలోని బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు, ఇతర ఫైనాన్స్ సంస్థలు తప్పనిసరిగా వినియోగదారుల సమస్యల పరిష్కారం, ఫిర్యాదులకు సొంతగా అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ బ్యాంక్ ఇంటర్నల్‌గా అంబుడ్స్‌మెన్ సేవలు అందించాలి. కమర్షియల్ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ సంస్థలు, పేమెంట్ బ్యాంక్స్, ఎన్‌ఎఫ్‌బీసీలు, నాన్ బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ యూజర్స్, క్రెడిట్ ఇర్ఫర్మేషన్ కంపెనీలన్నీ ఈ మార్గదర్శకాలు పాటించాలని ఆర్బీఐ సూచించింది. అంబుడ్స్‌మెన్‌లో ఉన్నతస్థాయి అధికారి లేదా పదవీ విరమణ చేసిన అధికారిని నియమించాలి. బ్యాంక్ నిబంధనలు, వినియోగదారులకు ఉండే హక్కుల గురించి అవగాహన కలిగిన వారిని అంబుడ్స్‌మెన్‌లో నియమించాలి. కనీసం వీటిల్లో వారికి ఏడేళ్ల అనుభవం కలిగి ఉండాలని ఆర్బీఐ తన నిబంధనల్లో పేర్కొంది.
బ్యాంకుల అంబుడ్స్‌మెన్ అందించే సేవలు
అయితే బ్యాంకుల్లో ఉండే అంబుడ్స్‌మెన్‌లు నేరుగా కస్టమర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించవు. బ్యాంక్ పరిశీలించిన, పాక్షింగా పరిష్కరించబడిన లేదా తిరస్కరించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తారు. వినియోగదారుల కంప్లైంట్‌ను రిజెక్ట్ చేసేముందు అత్యన్నత స్థాయి అధికారి అంబుడ్స్‌మెన్ పరిశీలిన జరపాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ ఏదైనా సమస్యను రిజెక్ట్ చేసినా లేదా పాక్షింగా పరిష్కరించినా వెంటనే అది బ్యాంకుల్లోని ఇంటర్నల్ అంబుడ్స్‌మెన్‌కు ఫార్వర్డ్ అవుతుంది. ఈ కొత్త మార్గదర్శకాలను బ్యాంకులు అమలు చేస్తున్నాయా.. లేదా అనేది ఆర్బీఐ ఎప్పుటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది.
