Sekhar Kammula : ఆ హీరోయిన్‌తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వాస్తవికతకు దగ్గరగా.. సహజంగా ప్రేమకథలను రూపొందించడంలో ఆయనకు సాటిలేరు. ఆయన పేరు చెప్పగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తొస్తాయి. తక్కువ చిత్రాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. తాజాాగా ఓ హీరోయిన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్మల. ఆయన పేరు చెప్పగానే ఫీల్ గుడ్ మూవీస్ గుర్తొస్తాయి. ఆనంద్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న.. ఆ తర్వాత గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ, హ్యాపీడేస్ వంటి చిత్రాలతో మెప్పించారు. ఇటీవలే కుబేర మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో క్లాసిక్ సినిమాలతో విజయాలను అందుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆకట్టుకున్నారు. అయితే ప్రేమకథ చిత్రాలే కాకుండా విభిన్న కంటెంట్ సినిమాలను రూపొందించడంలోనూ ముందుంటారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
రానా దగ్గుబాటి హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు. ఎంతో మంది హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా మంది తారలు అనుకుంటారు. కానీ ఓ హీరోయిన్ తో అనవసరంగా సినిమా చేశా అని ఫీల్ అవుతున్నారు శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన అనామిక సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించింది. ఆ సమయంలో తన దగ్గర సరైన కథ లేదని.. అయినా ఉన్న స్టోరీతో నయనతారతో సినిమా చేయడం పెద్ద తప్పుగా భావించినట్లు తెలిపారు. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా రూపొందిస్తే ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యిందని.. అలాంటి చిత్రాన్ని నయనతారతో అనవసరంగా తీసినట్లు చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
