Puffed Rice: స్నాక్స్ గా మరమరాలను చేర్చుకోండి.. బరువు తగ్గించడమే కాదు ఆరోగ్యానికి మేలు
స్పైసీ ఫుడ్‌ను తినాలని భావించే వారు మరమరాలతో చేసిన ఆహారాన్ని తినొచ్చు. ఎందుకంటే బోరుగుల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది ఫైబర్ రిచ్ ఫుడ్. దీనిని తినడం వలన కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. త్వరగా ఆకలి వెయ్యదు. దీని కారణంగా ఎక్కువగా ఆహారం తినడం తగ్గిస్తారు. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. తేలికపాటి త్వరగా జీర్ణం అయ్యే మర మరాలను తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంట్లోనే వీటితో రకరకాల ఆహారాన్ని తయారు చేసుకుని తినొచ్చు.
ప్రతి ఒక్కరూ చిరుతిళ్లను టీతో తినడానికి ఇష్టపడతారు. కొంతమంది ఆఫీసులో బిస్కెట్లు, బజ్జీలు, పకోడీ వంటి వాటిని స్నాక్స్‌గా తినడానికి ఇష్టపడతారు. స్నాక్స్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తినడం వలన శరీరం శక్తిని పొందుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే స్నాక్స్ గా మరమరాలను తినడం ఆరోగ్యానికి మంచింది. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాదు.. ముఖ్యంగా స్పైసీ ఫుడ్‌ను తినాలని భావించే వారు మరమరాలతో చేసిన ఆహారాన్ని తినొచ్చు. ఎందుకంటే బోరుగుల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది ఫైబర్ రిచ్ ఫుడ్. దీనిని తినడం వలన కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. త్వరగా ఆకలి వెయ్యదు. దీని కారణంగా ఎక్కువగా ఆహారం తినడం తగ్గిస్తారు. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. తేలికపాటి త్వరగా జీర్ణం అయ్యే మర మరాలను తినడం వలన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంట్లోనే వీటితో రకరకాల ఆహారాన్ని తయారు చేసుకుని తినొచ్చు.
స్నాక్స్ మీరు మరమరాలను నేరుగా చిరుతిండిగా కూడా తినవచ్చు, ఇందులో కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడిని జోడించి నేరుగా తినవచ్చు.
మరమారాల మిక్చర్ బాణలి లో నూనె వేసి వేడి ఎక్కిన నూనేలో మరమరాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇష్టమైన మసాలా దినుసులను జోడించడం ద్వారా రుచికరమైన మరమారాల మిక్చర్ ను తయారు చేసుకోవచ్చు, ముఖ్యంగా మసాలాలు, నూనెను సరైన మొత్తంలో ఉపయోగించాలని గుర్తుంచుకోండి .
మరమారాల చాట్ స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడితే మరమారాలు ఉడకబెట్టిన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చి చట్నీ, చాట్ మసాలాతో కలపాలి. అంతే మరమారాల చాట్ సిద్ధంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)