Drinking Water Tips: ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త అంటున్న నిపుణులు

వేసవిలో మండే ఎండల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంత సేపటికి నీరు తాగాలి, నీరు తాగడానికి సరైన సమయం ఏది అన్నది చాలా ముఖ్యమని ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గౌరవ్ జైన్ చెబుతున్నారు. ఈ సీజన్‌లో హైడ్రేషన్ మాత్రమే మిమ్మల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. అధిక ఉష్ణోగ్రత, బలమైన సూర్యకాంతి కారణంగా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండడం కోసం వేసవిలో నీరు పుష్కలంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ గౌరవ్ చెప్పారు.

Drinking Water Tips: ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త అంటున్న నిపుణులు
Drinking Water Tips In SummerImage Credit source: pexels
Follow us

|

Updated on: May 24, 2024 | 6:35 PM

ఎవరైనా సరే వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. వేసవిలో చెమట ద్వారా శరీరం నుంచి ఎలక్ట్రోలైట్స్ పోతాయి. అటువంటి పరిస్థితిలో నిర్జలీకరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరం చల్లగా, హైడ్రేట్ గా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే ఎండలో బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన వెంటనే కొందరు వ్యక్తులు నేరుగా నీరు తాగడం ప్రారంభిస్తారు. అయితే ఇలాంటి సంఘటన అనారోగ్యానికి కారణం అని ఈ పొరపాటుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో మండే ఎండల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంత సేపటికి నీరు తాగాలి, నీరు తాగడానికి సరైన సమయం ఏది అన్నది చాలా ముఖ్యమని ఢిల్లీలోని ధర్మశిలా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గౌరవ్ జైన్ చెబుతున్నారు. ఈ సీజన్‌లో హైడ్రేషన్ మాత్రమే మిమ్మల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది.

నీరు అవసరం

అధిక ఉష్ణోగ్రత, బలమైన సూర్యకాంతి కారణంగా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండడం కోసం వేసవిలో నీరు పుష్కలంగా తీసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ గౌరవ్ చెప్పారు. అయితే ఎండలో ఎక్కువ సేపు గడిపి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వెంటనే నీళ్లు తాగకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలా నీరు తాగడం వలన జలుబు, తల తిరగడం, హీట్ స్ట్రోక్ , ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

నీరు ఎప్పుడు త్రాగాలంటే

మండే ఎండలో తిరిగి తిరిగి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. కొంచెం సేపు అంటే కనీసం 15-20 నిమిషాలు హాయిగా కూర్చోండి. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితిలోకి చేరుకుంటుంది. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే నీరు తాగాలి. నీటిని ఒకేసారే తాగకుండా నిదానంగా తాగాలి.

తలతిరిగినట్లు అనిపిస్తే

అంతేకాదు ఎండలో ఎక్కువ సేపు ఉన్న తర్వాత.. తక్కువ వ్యవధిలో నీరు త్రాగాలి. అదే సమయంలో ఎండలో ఎక్కువసేపు గడిపిన తర్వాత తల తిరిగినట్లు అనిపిస్తే.. తాగే నీటిలో నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం ఆరోగ్యానికి మేలు. తద్వారా మీకు నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. శరీర శక్తి కూడా తిరిగి వస్తుంది. కావాలంటే కొబ్బరి నీళ్లు కూడా తాగొచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్‌ బారిన పడకుండా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..