Copper Bottle: రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా.. ఇలా తాగితే ఆరోగ్యానికి హానికరం

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాదు జీర్ణ శక్తిని పెంచుతోంది. అంతేకాదు రాగి పాత్ర లోని నీరు తాగడం వల్ల బరువు తగ్గడం, జుట్టు బలోపేతం చేయడం, రక్తపోటు నియంత్రణ, మెరిసే చర్మం, రక్తహీనత నివారణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రాగి సీసాలో నిల్వ ఉంచిన నీరు ఎప్పుడు ఆరోగ్యానికి హనికరమో ఈ రోజు తెలుసుకుందాం..

Copper Bottle: రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా.. ఇలా తాగితే ఆరోగ్యానికి హానికరం
Copper Bottle Water
Follow us

|

Updated on: Aug 05, 2024 | 3:34 PM

రాగి ఒక రకమైన లోహం. ఈ లోహంతో తయారు చేసిన పాత్రలకు భారతీయులకు అవినావ భావ సంబంధం ఉంది. పూర్వకాలం నుంచి భారతీయ ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. ఈ లోహంతో చేసిన పాత్రలలో ఉంచిన నీరు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా ఈ రోజుల్లో రాగి వాటర్ బాటిళ్ల ట్రెండ్ నడుస్తోంది. రాగి గ్లాసులు, రాగి వాటర్ బాటిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఆఫీసులో కూడా రాగి బాటిళ్లను తమతో ఉంచుకుంటారు. అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోకపోతే రాగి సీసాలలో ఉంచిన నీరు మీ ఆరోగ్యానికి ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తుందని మీకు తెలుసా..

రాగి సీసాలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబితే.. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాదు జీర్ణ శక్తిని పెంచుతోంది. అంతేకాదు రాగి పాత్ర లోని నీరు తాగడం వల్ల బరువు తగ్గడం, జుట్టు బలోపేతం చేయడం, రక్తపోటు నియంత్రణ, మెరిసే చర్మం, రక్తహీనత నివారణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రాగి సీసాలో నిల్వ ఉంచిన నీరు ఎప్పుడు ఆరోగ్యానికి హనికరమో ఈ రోజు తెలుసుకుందాం..

రాగి సీసాలోని నీళ్ల వల్ల ఎప్పుడు హాని కలుగుతుందంటే..?

ఇవి కూడా చదవండి

రాగి పాత్రలో 4 నుండి 5 గంటల పాటు నీటిని నిల్వ చేసి ఆ నీరు త్రాగాలి. అయితే ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీరు మాత్రమే తాగితే.. గరిష్టంగా 12 గంటలు నిల్వ ఉంచిన నీరు త్రాగవచ్చు. అయితే బాటిల్‌లో నీరు చాలా కాలం పాటు నిల్వ ఉంచి ఆ నీటిని నిరంతరం తాగితే శరీరంలో రాగి పరిమాణం పెరుగుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది.

కల్తీ రాగి బాటిల్

ప్రస్తుతం రకరకాల రాగి సీసాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అయితే కొన్ని బాటిల్స్ కల్తీ లోహంతో తయారు చేస్తున్నారు. చాలా సీసాలు లోపల రాగితో తయారు చేసినవి కావు. దీని కారణంగా, ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక రాగి బాటిల్‌ను కొనుగోలు చేసే సమయంలో దానిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే మంచి బ్రాండ్ బాటిల్స్ ను కొనుగోలు చేయాలి.

పరిశుభ్రత లోపించడం వల్ల అనారోగ్యం

రాగి సీసాని ఉపయోగిస్తుంటే రోజూ దానిని పూర్తిగా శుభ్రం చేయండి. బాటిల్ టాప్ చాలా ఇరుకుగా ఉంటుంది కనుక బాటిల్స్ ను శుభ్రం చేయడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఈ బాటిల్స్ లోని నీరు తాగితే అనారోగ్యానికి గురవుతారు. కనుక బాటిల్ కొనేటప్పుడు బాటిల్ నోరు వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా బాటిల్ లోపల ప్రతి భాగాన్ని శుభ్రం చేసుకోవచ్చు. బ్రష్‌తో లోపల పూర్తిగా శుభ్రం చేయవచ్చు. ఈ విధంగా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా రాగి సీసాలో నిల్వ చేసే నీటి వలన కలిగే హానిని నివారించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా..
రాగి బాటిళ్లలో నీటిని తాగడానికి నియమాలున్నాయని తెలుసా..
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
గౌతమ్ గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు
గౌతమ్ గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...