IRCTC: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ టూర్‌ ప్యాకేజీ, ఫ్లైట్‌లో జర్నీ..

ముఖ్యంగా త్వరగా టూర్‌ను కంప్లీట్‌ చేయాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఎయిర్‌ టూర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే తాజాగా విశాఖపట్నం నుంచి కూడా ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆగస్టు 9, 23వ తేదీల్లో ఈ టూర్‌ అందుబాటులో ఉంది...

IRCTC: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ టూర్‌ ప్యాకేజీ, ఫ్లైట్‌లో జర్నీ..
Tirumala
Follow us

|

Updated on: Aug 05, 2024 | 4:22 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తుంటారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏడాదిలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే దర్శనం టికెట్స్‌ ముందుగా లభించకనో, రూమ్స్‌ అందుబాటులో లేకో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికోసమే ఐఆర్‌సీటీసీ మంచి టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది.

ముఖ్యంగా త్వరగా టూర్‌ను కంప్లీట్‌ చేయాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఎయిర్‌ టూర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే తాజాగా విశాఖపట్నం నుంచి కూడా ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆగస్టు 9, 23వ తేదీల్లో ఈ టూర్‌ అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* మొదటి రోజు విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్ నుంచి ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హోటల్‌లో తీసుకెళ్తారు. ఫ్రెషప్‌ అయిన తర్వాత భోజనం ముగించుకొని కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల సందర్శన ఉంటుంది. తిరిగి హోటల్‌కు చేరుకున్న తర్వాత భోజనం చేసి రాత్రి హోటల్‌లోనే బస ఉంటుంది.

* రెండో రోజు ఉదయం టిఫిన్‌ చేయగానే తిరుమల వెంకటేశ్వర స్వామి శీఘ్రదర్శనం ఉంటుంది. దర్శనం పూర్తి కాగానే లంచ్‌ చేసిన తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల దర్శనం ఉంటుంది. తిరిగి మళ్లీ సాయంత్రం హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి తిరుపతి హోటల్‌లోనే బస ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత హోటల్‌ నుంచి చెకవుట్ చేస్తారు. అనంతరం గోవింద రాజస్వామి దేవాలయం, ఇస్కాన్ ఆలయాలను సందర్శన ఉంటుంది. మధ్యలోనే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విశాఖకు తిరుపతి నుంచి విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 6:35 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. సింగిల్‌ ఆక్యూపెన్సీ ప్రారంభ ధర రూ. 23,565, డబుల్‌ ఆక్యూపెన్సీ రూ. 20,195, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ. 20,000, చైల్డ్‌ విత్ బెడ్ రూ. 18,375, చైల్డ్ వితవుట్ బెడ్ ధర రూ. 17,880గా నిర్ణయించారు. ఇది 9వ తేదీన బుక్‌ చేసుకున్న వారికి. 23వ తేదీ ప్యాకేజీకి మరో రకమైన ఫేర్‌ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? చిరంజీవి మూవీలో ఛాన్స్
ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? చిరంజీవి మూవీలో ఛాన్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి