Sagar Gates: నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్ళు.. 22 గేట్లు ఎత్తివేత.. పోటెత్తుతున్న పర్యాటకులు

నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దీంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.

Sagar Gates: నాగార్జున సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్ళు.. 22 గేట్లు ఎత్తివేత.. పోటెత్తుతున్న పర్యాటకులు
Nagarjuna Sagar Dam
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 06, 2024 | 12:25 PM

నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దీంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 585.10 అడుగుల నీటి మట్టడానికి చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం 297.50టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆశించిన స్థాయిలో నాగార్జునసాగర్ కు వరద రాకపోవడంతో రిజర్వాయర్ వట్టి పోయింది. 2022 ఆగష్టు 11న క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత తొలిసారిగా ఇప్పుడు అధికారులు గేట్లను ఎత్తివేశారు.

సాగర్ కు పర్యాటకుల తాకిడి..

నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తిన విషయం తెలుసుకొని జలాశయం అందాలను చూసేందుకు రెండో రోజు కూడా భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడిని పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. సాగర్‌ అందాలను తిలకించడానికి పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాట క ప్రాంతాలైన అనుపు, బుద్ధ వనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృ హం వెనక ఉన్న నూతన లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది.

వీడియో చూడండి..

సాగర్ వరద కాల్వకు గండి..

నాగార్జునసాగర్ వరద కాల్వకు గండి పడింది. అనుముల మండలం మారెపల్లి దగ్గర వరద కాల్వకు భారీ గండి పడడంతో కృష్ణా జలాలు వృధాగా పోతున్నాయి. ఈ నెల రెండో తేదీన లెవెల్ కెనాల్ దగ్గర మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నీటిని విడుదల చేశారు. అయితే వరద కాలువ బలహీనంగా ఉండడంతో మారేపల్లి దగ్గర భారీ గండి పడింది. నీరు మొత్తం పొలాల్లోకి వృధాగా వెళ్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. లో- లెవెల్ పంప్ హౌస్ దగ్గర నీటిని నిలిపివేశారు. మరోవైపు గండిని పూడ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే