Street Dogs: గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి.. 2 వేల కుక్క కాటు బాధితులు
గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలు చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో వీధిలో కుక్కలు ఉన్నాయంటే చాలు వామ్మో కుక్కలు అంటూ అటు వైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందిరపై దాడి చేస్తూ వీధికుక్కులు రెచ్చిపోతున్నాయి. గంట వ్యవధిలో బాలానగర్‌లో దాదాపు 24 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలు చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటకు వెళ్లే సమయంలో వీధిలో కుక్కలు ఉన్నాయంటే చాలు వామ్మో కుక్కలు అంటూ అటు వైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందిరపై దాడి చేస్తూ వీధికుక్కులు రెచ్చిపోతున్నాయి. గంట వ్యవధిలో బాలానగర్‌లో దాదాపు 24 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలనగర్ పరిధి వినాయకనగర్‌లో వీధి కుక్క స్వైర విహారం చేశాయి. ఓకే రోజూ గంటల వ్యవధిలోనే 24 మంది పిల్లలపై దాడి చేసి విచక్షణా రహితంగా కరిచాయి. దాడికి గురైన వారిలో ఏడాదిన్నర వయస్సు నుండి 16 ఏళ్ళ వయస్సు చిన్నారులు, బాలురు ఉన్నారు . వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, చిన్నారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వీధి కుక్కలు దాడులు చేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాలనీలలో తిరుగుతూ క్రూర మృగాల్లా చిన్న పిల్లలపై దాడి చేసి పసి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. గత నెల 6 న మియాపూర్ లో 6 సంవత్సరాల సాత్విక్ ను వీధి కుక్కలు చంపేశాయి. నిన్నగాక మొన్న చిత్రపూరి కాలనీలో వాకింగ్ చేస్తున్న గృహిణిపై కుక్కల మంద దాడి చేసి గాయపరిచాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు వందల సంఖ్యలో కుక్కల దాడి కేసులు వెలుగు చూస్తున్నాయి.
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కు నెలకు దాదాపు 2 వేల మందికి పైగా కుక్క కాటు బాధితులే వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని వైద్యులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఐదు చోట్ల జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షల కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన ఏడు నెలల్లో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో 18వేల618 కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఏంసీకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతి రోజు సుమారు 40 నుంచి 50 వీధి కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్ కు తీసుకొని వస్తున్నారు. ఆపరేషన్ అనంతరం కుక్క కుడి చెవి చివరన వీ షేప్లో కట్ చేస్తారు. అదే విధంగా ప్రతి కుక్కకూ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ హ్యుమినిటీ సంవత్సరం పాటు ఉంటుంది. వీధి కుక్కలతో ఇబ్బందులు ఏర్పడితే 040-2311 1111 ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.