Kedarnath: కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతలోని జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అనేక పర్వత నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పర్వతానువుల్లోని రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో కేదార్‌నాథ్ యాత్రలో యాత్రికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతినడంతో.. దాదాపు 1600మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు.
ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతలోని జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అనేక పర్వత నదుల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పర్వతానువుల్లోని రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో కేదార్‌నాథ్ యాత్రలో యాత్రికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతినడంతో.. దాదాపు 1600మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. గౌరీకుండ్ – కేదార్‌నాథ్ మధ్య 13చోట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు యాత్రికులు. ఇలా చిక్కుకుపోయిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నారు.
వరదల్లో చిక్కుకున్న యాత్రికులను హెలీకాప్టర్లతో తరలిస్తున్నాయి సహాయక బృందాలు. అయితే సహాయ చర్యలకు ప్రతికూల వాతావరణం విఘాతం కలిగిస్తోంది. అయితే, సహాయక చర్యల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యతనివ్వడంతో… దూరప్రాంత యాత్రికులకు నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని చోట్ల ఆహారం, నీరు అందక యాత్రికులు అవస్థలు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల మాత్రం పోలీసులు ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. తెలుగు వారి విషయానికొస్తే కేదార్‌నాథ్‌లోని స్వర్గరోహిణీ కాటేజ్‌లో పలువురు ఉన్నారు. తమకు సాయం చెయ్యాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి పలువురు మెసేజ్ చేశారు. దీంతో ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడారు బండి సంజయ్. యాత్రికులను సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రికి చెప్పారు ఆ జిల్లా కలెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

