Vijay Milton: సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!

Vijay Milton: సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!

Anil kumar poka

|

Updated on: Aug 06, 2024 | 12:12 PM

సాధారణంగా తాను దర్శకత్వం వహించిన సినిమాలో ప్రతి సీన్ గురించి దర్శకుడికి అవగాహన ఉంటుంది. కానీ తన సినిమాలో ఓ సీన్ తాను డైరెక్ట్ చేసింది కాదని దర్శకుడు గుర్తిస్తే ఎలా ఉంటుంది.? సరిగ్గా ఇదే ఫీలింగ్ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ కు ఎదురైంది. 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో మళై పిడికత మనితన్ సినిమా రూపుదిద్దుకుంది.

సాధారణంగా తాను దర్శకత్వం వహించిన సినిమాలో ప్రతి సీన్ గురించి దర్శకుడికి అవగాహన ఉంటుంది. కానీ తన సినిమాలో ఓ సీన్ తాను డైరెక్ట్ చేసింది కాదని దర్శకుడు గుర్తిస్తే ఎలా ఉంటుంది.? సరిగ్గా ఇదే ఫీలింగ్ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ కు ఎదురైంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో మళై పిడికత మనితన్ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా 2022లో ప్రారంభం కాగా, ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలైంది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

అయితే, సినీ పాత్రికేయులతో కలిసి ఈ సినిమా వీక్షించిన దర్శకుడు విజయ్ మిల్టన్ ఓ సీన్ చూసి షాక్‌కి గురయ్యాడు. తాను చిత్రీకరించిన ఇంట్రడక్షన్ సీన్ స్థానంలో మరో సీన్ ఉండడంతో ఆయన నమ్మలేకపోయాడు. కొత్తగా కనిపిస్తున్న ఆ సీన్ తాను దర్శకత్వం వహించింది కాకపోవడంతో, ఆ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారో, దాన్ని సినిమాలో ఎవరు యాడ్ చేశారో అర్థంకాక తలపట్టుకున్నాడు. తన సినిమాను సెన్సార్ కు పంపించినప్పుడు ఆ కొత్త సీన్ లేదని, థియేటర్లలో విడుదలయ్యాక కొత్త సీన్ కనిపిస్తోందని దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నాడు. వాస్తవానికి తాను డైరెక్ట్ చేసిన సీన్ హీరో విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ ను తెలిపేలా ఉంటుందని, కానీ ఆ సన్నివేశం స్థానంలో కొత్త సీన్ పెట్టడం వల్ల సినిమాలో సస్పెన్స్ పోయి సాధారణ సినిమాలా మారిపోయిందని ఆవేదనగా తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.