Winter Foods: చలికాలంలో ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి.. డోంట్ మిస్!
వర్షా కాలమే కాకుండా చలి కాలంలో కూడా ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహారాలు పడితే వాటిని తినకూడదు. ముఖ్యంగా రోడ్డు మీద లభించే ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా కొన్ని ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది..
వింటర్ సీజన్‌ని వ్యాధుల కాలంగా కూడా చెబుతారు. చలికాలం వచ్చిందంటే ఏదో ఒక జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఇందుకు ముఖ్య కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. చలి కాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను ఈ సీజన్‌లో ఖచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల మీరు త్వరగా అలసట, నీరసం చెందకుండా.. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. మినరల్స్, విటమిన్స్, ఫైబర్, ఖనిజాలు ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. చలి కాలంలో త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలనే తీసుకోవాలి. దీని వల్ల మీ జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మరి అలాంటి ఆహారాలు ఏంటి? వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి కూర:
చలికాలంలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్స్‌లో మెంతి కూర కూడా ఒకటి. మెంతికూర ఈ సీజన్‌లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి మెంతి కూర తీసుకోవడం వల్ల మీకు మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి. మెంతి కూర కూడా రుచిగా ఉంటుంది. ఎలా తీసుకున్న పర్వాలేదు.
పచ్చి బఠాణీలు:
పచ్చి బఠాణీల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వీటిల్లో అధిక శాతం ప్రోటీన్, ఫైబర్ లభిస్తాయి. వీటిపి కూరగాయలు, ఇతర ఆహారలతో పాటు తీసుకోవచ్చు. స్నాక్స్ రూపంలో, సలాడ్స్‌లో కూడా కలిపి తీసుకోవచ్చు. గ్రీన్ పీస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు ఉన్నవి తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.
బీట్ రూట్ – క్యారెట్స్:
చలి కాలంలో బీట్ రూట్, క్యారెట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. బీట్ రూట్, క్యారెట్స్‌లో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపి.. ఇమ్యూనిటీని బలపరుస్తాయి. దీంతో త్వరగా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.
పాలకూర:
చలి కాలంలో రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన ఆహారాల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరలో కూడా అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ముందుగానే అరికడుతుంది. కాబట్టి పాలకూర తగిన మోతాదులో తరచూ తీసుకున్నా మంచిదే. అలాగే క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటివి తీసుకోవడం వల్ల కూడా చర్మం హైడ్రేట్‌గా ఉండి తగిన పోషకాలు అందుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..