Pain Treatment: హాట్, కోల్డ్ కంప్రెస్‌లు ఏయే సందర్భాల్లో వాడాలో తెలుసా? చాలా మంది చేసే పొరబాటు ఇదే

మన ఒంట్లో ఎక్కడైనా నొప్పిగా ఉంటే వేడి నీటితో కాపడం పెట్టడం అలవాటు. అలాగే ఒక్కోసారి ఐస్ క్యూబ్ లతో కూడా కాపడం పెడుతుంటారు. అయితే చాలా మందికి ఈ రెండింటిలో ఎలాంటి నొప్పికి ఎలాంటి ప్యాక్ వాడాలో తెలియక అన్నింటికీ ఒకటే వాడేస్తుంటారు. ఇది సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు..

Pain Treatment: హాట్, కోల్డ్ కంప్రెస్‌లు ఏయే సందర్భాల్లో వాడాలో తెలుసా? చాలా మంది చేసే పొరబాటు ఇదే
Hot Bag Or Ice Bag
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2024 | 1:25 PM

శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి ఉంటే హాట్, కోల్డ్ కంప్రెస్‌లు సాధారణంగా చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈ విధానం మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ ట్రిక్‌ వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. నొప్పిని తగ్గించి, ఉపశమనం కలిగించడంలో ఇవి బలేగా ఉపయోగపడతాయి. వేడి లేదా చల్లటి నీరు కలిగిన ఐస్ క్యూబ్స్ నొప్పి ఉన్న చోట్ల ఉంచితే నొప్పి, వాపును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌లేని సంప్రదాయ పద్ధతి. కానీ చాలా మందికి ఏ పరిస్థితులలో ఏ కంప్రెస్ (వేడి లేదా చల్లని) ఉపయోగించాలో తెలియదు. నిపుణుల మాటల్లో ఈ సమాచారం మీకోసం..

ఏ సమయంలో ఏ చికిత్స ఉత్తమం?

అన్ని సందర్భాల్లో వేడి ప్యాక్‌ అవసరం ఉండదు. ఐస్ ప్యాక్ ఎప్పుడు వేయాలో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. కొన్నిసార్లు ఈ రెండు చికిత్సలు అవసరమవుతాయి. గాయపడిన ప్రదేశానికి వేడిని ఉపయోగించడం సాధారణంగా రక్త ప్రవాహాన్ని ప్రేరేపించి, ప్రసరణను పెంచుతుంది. ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదల కూడా నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కండరాల పని తీరును పెంచుతుంది. దీర్ఘకాలిక నొప్పి, కీళ్ల నొప్పులకు హీట్ థెరపీని ఉపయోగిస్తారు. సాధారణ వాపు, తీవ్రమైన గాయాలు, నొప్పికి కోల్డ్ థెరపీ లేదా క్రయోథెరపీని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు పడిపోవడం, కాలు వాచడం లేదా బంప్ ఉంటే ఐస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. కండరాలలో నొప్పి ఉంటే వేడి నీటి ప్యాక్‌ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

హీట్ థెరపీ లేదా థర్మోథెరపీ కండరాల నొప్పి, దీర్ఘకాలిక నొప్పి, పాదాల నొప్పి, శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స తర్వాత నొప్పి, ఆర్థరైటిస్, వృద్ధాప్య నొప్పులు, గాయాలు వేగంగా నయం కావడానికి ఉపయోగపడుతుంది. కానీ హీట్ థెరపీని కణజాలంలోకి రక్తస్రావం వల్ల కలిగే తీవ్రమైన ఇన్ఫ్లమేటరీ గాయాలకు చికిత్స చేయదు. గాయపడిన ప్రాంతానికి వేడిని వర్తింపజేయడం వల్ల రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

ఐస్ ప్యాక్ ఎప్పుడు వాడాలంటే..

ఐస్ ప్యాక్‌లు వాపు, మంట, గాయం వల్ల కలిగే నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. గాయం తర్వాత మొదటి 48 గంటల్లో ఐస్‌ ప్యాక్‌ ఉపయోగకరంగా ఉంటుంది. చీలమండ పగుళ్లు వంటి గాయాలకు ఐస్ ప్యాక్‌లను తరచుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మరోవైపు ఇది కీళ్ల నొప్పులను తగ్గించడానికి, కండరాలను సడలించడానికి కూడా సహాయపడుతుంది. అయినా ఉపశమనం కలిగించకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?