Weight Loss Tips : బరువు పెరుగుతున్నారని బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి మీ కేలరీలు ఇట్టే ఖర్చవుతాయి..

Weight Loss Tips : కరోనా మహమ్మారి వల్ల అందరు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు.

Weight Loss Tips : బరువు పెరుగుతున్నారని బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి మీ కేలరీలు ఇట్టే ఖర్చవుతాయి..
Weight Loss Foods
Follow us

|

Updated on: Jun 21, 2021 | 10:34 PM

Weight Loss Tips : కరోనా మహమ్మారి వల్ల అందరు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో వారికి తెలియకుండానే అధిక కేలరీలు ఉన్న ఆహారం తింటున్నారు. శ్రమ లేకపోవడంతో విపరీతంగా బరువు పెరుగుతున్నారు. లాక్‌డౌన్ వల్ల జిమ్‌లు, పార్కులు మూసి వేయడంతో స్థూలకాయంతో ఇబ్బందిపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఇంటి దగ్గరే ఇలా చేసి మీ బరువును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, ఇంట్లో వస్తువుల్ని అటూ ఇటూ కదపడం, పాత వస్తువులు ఉంటే వాటిని తీసి ఇల్లంతా క్లీన్‌ చేసుకోవడం, దుస్తులు వాషింగ్‌ మెషిన్‌లో కాకుండా చేతులతో ఉతుక్కోవడం, వంట చెయ్యడం ఇలాంటి ఏవో ఒక పనులు చేస్తూనే ఉండాలని సూచిస్తున్నారు.

2. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌ల ముందు కూర్చొని సినిమాల వంటివి చూడటం కంటే ఇంట్లో ఎప్పటి నుంచో పూర్తి చెయ్యాలనుకుంటున్న పనులను ఇప్పుడు చేసేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే ఇల్లంతా ఓసారి క్లీన్‌ చేసుకోవడం లేదా సున్నం, పెయింట్‌ వంటివి వేసుకోవడం మేలంటున్నారు. తద్వారా చాలా కేలరీలు కరుగుతాయంటున్నారు.

3. ఉదయం 7 గంటలకే బ్రేక్‌ ఫాస్ట్‌ చెయ్యాలనీ, రాత్రి 7 గంటలకే డిన్నర్‌ పూర్తి చెయ్యాలని చెబుతున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకుంటున్న కొద్దీ బాడీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

4. తినే ఆహారం విషయంలోనూ తక్కువ కేలరీలు ఉండేవే తినాలని సూచిస్తున్నారు. వీలైనతవరకూ స్నాక్స్‌ తగ్గించమంటున్నారు. ఆకుకూరలు, కూరగాయల ఆహారం ఎక్కువగా తినాలని చెబుతున్నారు. ఫ్రైల బదులు కూరల వంటివి మేలంటున్నారు. వంటల్లో నూనె వాడకం తగ్గించాలని సూచిస్తున్నారు.

Dog Meat Festival : చైనా క్రూరత్వం.. కరోనా సమయంలో డాగ్ మీట్ ఫెస్టివల్..! వేలాది కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు..

Girl Commits Suicide : ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేదని బాలిక ఆత్మహత్య..! పేదరికంలో తల్లిదండ్రులు

Old Coins: ఈ కాయిన్ మీ దగ్గర ఉందా..! ఈ నాణానికి బదులుగా రూ. 10 లక్షలు పొందవచ్చు..! ఎలాగో తెలుసుకోండి..!