Lifestyle: స్వీట్స్‌ తినగానే దాహం ఎందుకు వేస్తుందో తెలుసా.?

స్వీట్లు తినగానే దాహం వేస్తోందంటే రక్తంలో చక్కెర పెరిగిందని అర్థం చేసుకోవాలి. నిజానికి స్వీట్ తినగానే అది మొదటి కడుపులోకి వెళ్లి రక్త ప్రసరణకు చేరుకుంటుంది. చక్కెర రక్తంలోకి చేరినప్పుడు, అది కణాలలో ఉన్న నీటిని గ్రహించడం ప్రారంభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కణాల నుండి నీరు రక్తంలోకి ప్రవేశిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర సమతుల్యత..

Lifestyle: స్వీట్స్‌ తినగానే దాహం ఎందుకు వేస్తుందో తెలుసా.?
Lifestyle
Follow us

|

Updated on: Apr 04, 2024 | 4:26 PM

మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో జరిగే ప్రతీ చర్యకు మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా మనం ఏదైనా స్వీట్ తింటే ఎక్కువగా దాహం వేస్తుంది.? మనలో చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ఉంటాం. ఇంతకీ స్వీట్ తినగానే దాహం ఎందుకు వేస్తుంది.? దీని వెకనాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్లు తినగానే దాహం వేస్తోందంటే రక్తంలో చక్కెర పెరిగిందని అర్థం చేసుకోవాలి. నిజానికి స్వీట్ తినగానే అది మొదటి కడుపులోకి వెళ్లి రక్త ప్రసరణకు చేరుకుంటుంది. చక్కెర రక్తంలోకి చేరినప్పుడు, అది కణాలలో ఉన్న నీటిని గ్రహించడం ప్రారంభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కణాల నుండి నీరు రక్తంలోకి ప్రవేశిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర సమతుల్యత అవుతుంది. కణాలు నీటిని కోల్పోగానే, నీరు అవసరమని మెదడుకు రసాయన సంకేతాలు పంపుతాయి. దీంతో దాహం వేయడం ప్రారంభమవుతుంది. స్వీట్స్‌ తినగానే దాహం వేయడానికి గల అసలు కారణం ఇదే.

ఇదిలా ఉంటే స్వీట్ తినగానే దాహం వేస్తుంది కదా అని జ్యూస్‌, డ్రింక్స్‌ తాగితే ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అప్పటికే స్వీట్స్‌ తిన్న తర్వాత మళ్లీ షుగర్‌ కంటెంట్‌ ఉండే డ్రింక్స్‌ ఎట్టి పరిస్థితులో తీసుకోకూడదు. దీంతో శరీరంలో మరింత ఎక్కువ కేలరీలు చేరే ప్రమాదం ఉంటుంది. అందుకే దాహం వేస్తే కొన్ని మంచి నీళ్లు తాగడం ఉత్తమం. స్వీట్ తిన్న వెంటనే కూడా నీళ్లు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. కనీసం 20 నిమిషాల తర్వాతే తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..